నా కోసం 6 బృందాలతో గాలింపా?

Published: Sunday October 06, 2019

‘గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. తాత్సారం చేస్తోంది. వెలికితీస్తామని ముందుకు వచ్చిన వారు చేతులెత్తేశారు. అలా చెప్పమని కూడా వాళ్లపై ఒత్తిడి తెస్తున్నారు. à°† బోటులో à°Žà°‚à°¤ మంది ప్రయాణించారు. ఎంతమంది చనిపోయారు. ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తేలాలి కదా! అక్కడేం జరిగిందో తెలియాలి కదా! ఇవన్నీ అడుగుతున్నానని నాపై అక్రమ కేసులు బనాయించారు. నేను దొంగను కాను.. ఆక్రమణదారుడినీ కాను.. అటువంటి పనులు కూడా చేయలేదు. నేను పారిపోయానని నా కోసం గాలిస్తున్నారు. నిన్న నాలుగు, à°ˆ రోజు ఆరు బృందాలు గాలించాయి. ఇంత గాలింపు ఎందుకు..? నీ మీద కేసు ఉంది... ఓసారి రమ్మంటే నేను రానా’ అని హర్షకుమార్‌ ప్రశ్నించారు. బోటు విషయంలో, కోర్టు ఆవరణలో à°’à°• ఆక్రమణ తొలగింపు వ్యవహారంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆయన కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. à°ˆ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. అనంతరం à°“ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కచ్చులూరు బోటు ప్రమాదంలో ఆచూకీ లభ్యంకాని వారిలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అశోక్‌ సోదరి రమ్యశ్రీ కూడా ఉన్నట్లు తెలిపారు. ‘నన్ను పట్టుకోవడానికి ఇంత గాలింపు అవసరం లేదు. ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడితే కేసులు బనాయిస్తున్నారు. మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావును కూడా వేధించి చంపేశారు. నేను తప్పించుకు తిరుగుతున్నానని, పారిపోయానని కొన్ని వార్తా పత్రికలు, చానళ్లలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం కక్షపూరిత విధానం మానేయాలి. వివిధ ప్రాంతాల నుంచి నిపుణులను రప్పిస్తామన్నారు. బోటును తీస్తామన్నారు. మరి ఎందుకు ఆపేశారు? ఇప్పటికైనా వెలికి తీయండి.. బాధిత కుటుంబాలను ఆదుకోండి’ అని విజ్ఞప్తి చేశారు