ఎవరి లబ్ధి కోసం జీవో 486 తెచ్చారు?

Published: Saturday October 26, 2019
‘వైసీపీ క్రమేణా ప్రజల మద్దతు కోల్పోతోంది.. దాని అస్తవ్యస్త విధానాలపై ప్రజల నుంచి భారీ ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన జనమే తిరిగి దెబ్బకొట్టే రోజు దగ్గర్లోనే ఉంది’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏ ప్రభుత్వమైనా సవ్యంగా పరిపాలిస్తే మిగతా పార్టీలకు పని ఉండదని.. 100 రోజుల్లోనే ఇన్ని అవకతవకలకు పాల్పడితే రోడ్ల మీదకు వచ్చి తీరతామని హెచ్చరించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఇసుక లారీల యజమానులు, మద్యం దుకాణాల కార్మికుల సంఘం నేతలు, జనసేన లీగల్‌ సెల్‌ సభ్యులతో విడివిడిగా సమావేశమైన ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీ హయాంలో ఇసుక మాఫియా రాజ్యమేలిందని.. వైసీపీ ప్రభుత్వం కూడా మాఫియాను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. అస్తవ్యస్త విధానాల మూలంగా లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, వాహన యజమానులు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 లక్షల మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కనీసం బియ్యం తెచ్చుకోవడానికి డబ్బులేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పది మందికి పని కల్పించాల్సిన మేస్ర్తీలు కూడా పస్తులుంటున్నారని చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే 3à°µ తేదీన విశాఖలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నామన్నారు.
 
‘15 రోజుల్లో ప్రకటిస్తామన్న ఇసుక పాలసీ 45 రోజులైనా, మూడు నెలలైనా, 100 రోజులు దాటేసినా అతీగతీలేదు. à°ˆ రోజుకీ ఇసుక విధానంపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. మన ఇసుక మనకు దొరకడం లేదు. కానీ బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో దర్శనమిస్తోంది. ఆన్‌లైన్‌ సిస్టమ్‌లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. దొంగల్లా అర్ధరాత్రి 12 గంటలకు తెరుస్తున్నారు’ అని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక రవాణాపై ఆధారపడి ఉన్న ఆరు వేల లారీలకే పనుల్లేకుంటే మరో ఆరు వేల లారీలను రంగంలోకి దించుతూ జీవో 486 విడుదల చేయడాన్ని తప్పుబట్టారు. ఎవరి లబ్ధి కోసం à°ˆ ప్రయత్నమని నిలదీశారు. ‘à°† లారీలపై జీఎస్టీ తగ్గించాలనడం సరికాదు. à°† భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. రేపు మిగతా రాష్ట్రాలూ ఇదే అనుసరిస్తే కేంద్రం నిధుల్లో కోతపడుతుంది. కేంద్రానికి కూడా ఆదాయం తగ్గుతుంది. à°ˆ విషయాన్ని ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్‌, అమిత్‌ à°·à°¾ దృష్టికి తీసుకెళ్తాం’ అని స్పష్టం చేశారు. 10 మందికి ఉద్యోగం కల్పించడం కోసం పది వేల మందిని తీసేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఏమన్నారంటే..