అమరావతిపై ఎందుకీ విష ప్రచారం!

Published: Monday October 28, 2019
 ‘‘హైదరాబాద్‌కు దీటైన నగరం à°ˆ రాష్ట్రానికి వద్దా? 13 జిల్లాల అభివృద్ధికి అవసరమైన నిధులు, ఉద్యోగాలు కల్పించగల రాజధాని ఆంధ్రులకు అవసరం లేదా? హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలకు దీటుగా నిలబడగలిగిన రాజధాని నగరం లేకపోతే ఇక్కడకు వచ్చేవారు... పెట్టుబడులు పెట్టేవారు ఎవరు? అమరావతిపై ఎందుకింత విష ప్రచారం చేస్తున్నారు?’’ అని మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. à°† పార్టీ శాసనసభాపక్ష ఉప నేతలు గోరంట్ల బుచ్చయ్య, కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు శనివారం సంయుక్తంగా à°’à°• బహిరంగ లేఖను మంత్సి బొత్సకు రాశారు. రాజధానిపై ఇటీవల మంత్రి వ్యాఖ్యల నేపఽథ్యంలో వారు ఆయనకు à°ˆ లేఖ రాశారు.
 
ప్రజా రాజధానికి కుల తత్వం, ప్రాంతీయ తత్వం అంటగట్టి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ద్వారా మంత్రి తన స్థాయిని దిగజార్చుకొంటున్నారని విమర్శించారు. ‘‘à°’à°• సామాజిక వర్గం కోసమే రాజధాని అంటూ మంత్రి అబద్ధాలు చెబుతున్నారు. ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని ఉండటం ముఖ్యమంత్రి జగన్‌కు ఇష్టం లేదా? రాజధానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జనాభా 75 శాతం. రాజధానిలోని 29 గ్రామ పంచాయితీల్లో పదిహేను పంచాయితీల్లో కాపులు గణనీయంగా ఉన్నారు. రెడ్డి, కమ్మ జనాభా ఇంచుమించుగా సమానంగా ఉంది. తుళ్ళూరు, తాడేపల్లి మండలాల్లో కమ్మ, రెడ్డి కులాల వారికి సమానంగా భూములు ఉన్నాయి. à°ˆ వాస్తవాలు కప్పిపెట్టి కేవలం à°’à°• సామాజిక వర్గంపై దుష్ప్రచారం చేస్తున్నారు. రాజధానిని ఆనుకొని ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్లో బ్రాహ్మణ, వైశ్య, ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. అన్ని కులాల సమాహారమైన ప్రాంతానికి à°’à°• కులం ముద్ర వేయడం దుర్మార్గం’’ అని వారు విమర్శించారు. అమరావతి స్వయం ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టని వారు పేర్కొన్నారు.
 
రైతులకు ఇవ్వగా మిగిలిన భూముల విలువ రూ.లక్ష కోట్లు ఉంటుందని, ఇందులో సగం ఖర్చు చేసినా హైదరాబాద్‌కు ధీటైన రాజధాని ఆంధ్రులకు ఏర్పడుతుందని వారు చెప్పారు. రాజధాని నిర్మాణాలన్నీ నిలిపివేయడం, ప్రజా వేదికను కూల్చి రాజధాని ప్రాంత ఇమేజిని దెబ్బ తీయడం వల్ల ఒక్క రాజధాని భూముల విలువే రూ.లక్ష కోట్ల మేర పడిపోయిందన్నారు. à°ˆ ప్రభావంతో మొత్తం రాష్ట్రం అంతా భూముల విలువ తగ్గిపోయిందని వివరించారు. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా పడిపోయిందన్నారు. హైదరాబాద్‌లో భూముల విలువ మాత్రం 30 శాతం పెరిగిందన్నారు. ‘‘హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు చుట్టూ జగన్‌కు, ఆయన అనుచర వర్గానికి భూములున్నాయి. వాటి రేట్లు పెంచుకోవడానికి అమరావతిని నష్టపరుస్తున్నారా? లేక దొనకొండలో కొనుగోలు చేసి పెట్టుకొన్న భూములు అమ్ముకోవడానికి చేస్తున్నారా? అదీ కాకపోతే హైదరాబాద్‌కు ధీటుగా అమరావతి ఉండరాదన్న కేసీఆర్‌ కోరిక నెరవేర్చడానికే à°ˆ వ్యవహారం అంతా నడిపిస్తున్నారా?’’ అని వారు ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్‌ 28à°¨ సీఆర్‌డీఏపై విడుదల చేసిన శ్వేత పత్రంలో రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.5600 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారన్నారు. పీటర్‌ కమిషన్‌ పేరుతో లీక్‌ చేసిన నివేదికలో రాజధాని నిర్మాణంలో రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం దుర్మార్గమని వారు విమర్శించారు. అమరావతిపై లేనిపోని అపోహలు సృష్టించడానికే వైఎస్‌ మేనత్త కుమారుడైన పీటర్‌ను నియమించారని వారు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం పునాది వేసిన సైబరాబాద్‌ ప్రాంతం ఒకటే ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలో పదమూడు లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తోందని తెలిపారు.