ఇసుక కొరతపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..

Published: Tuesday November 12, 2019
 à°†à°‚ధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఇసుక కొరతపై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నాడు à°ˆ విషయమై అధికారులతో సమీక్ష నిర్వహించి జగన్.. నవంబర్‌ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు జరపాలని ఆదేశించారు. ‘గతంలో సరాసరి ఇసుక డిమాండ్‌ 80వేల టన్నులు ఉండేది. వరదలతో రీచ్‌లు మునిగిన కారణంగా డిమాండ్‌ను చేరుకోలేకపోయాం. à°—à°¤ వారం రోజులుగా పరిస్థితి మెరుగుపడింది. రీచ్‌à°² సంఖ్య సుమారు 60 నుంచి 90à°•à°¿ చేరింది. 137 నుంచి 180 వరకూ స్టాక్‌ పాయింట్లు పెంచాలి. నియోజకవర్గాల వారీగా రేటు కార్డును ప్రకటించాలి. ఎల్లుండిలోగా రేటు కార్డును నిర్ణయించాలి. ఇసుక ఎక్కువ ధరకు అమ్మితే రెండేళ్ల వరకు జైలుశిక్ష. ఇసుక కొరత తీరే వరకూ సిబ్బంది సెలవులు తీసుకోవద్దు. సరిహద్దుల్లోని అన్ని రూట్లలో చెక్‌పోస్టులు పెట్టాలి. 10 రోజుల్లోగా చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి’ à°…ని అధికారులను జగన్ ఆదేశించారు.
 
కాగా.. à°à°ªà±€à°²à±‹ ఇసుక కొరతతో భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాలో లాంగ్ మార్చ్ కూడా తలపెట్టారు. అంతేకాదు à°ˆ వ్యవహారంపై నవంబర్-14à°¨ టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు.