రాజస్థాన్‌లో ఇసుక తుఫాను సృష్టించిన....... బీభత్సం

Published: Thursday May 03, 2018

జైపూర్ః రాజస్థాన్‌లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. రాజస్థాన్ ఈశాన్య ప్రాంతంలోని అల్వార్, ఢోర్‌పూర్, భరత్‌పూర్ జిల్లాలో ఇసుక తుఫాను ధాటికి 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక్క భరత్‌పూర్ జిల్లా నుంచే 12 మంది ఉన్నారు.
ఢోల్‌పూర్ జిల్లాలో మట్టితో నిర్మించుకున్న సుమారు 40 ఇళ్లు పిడుగుపాటుకు దగ్దమయ్యాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఢిల్లీకి 164 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్వార్ జిల్లాలో విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో నిన్న రాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో కరెంట్ నిలిచిపోయిందని వెల్లడించారు. ఇసుక తుఫాను విపత్తుతో అధికార యంత్రాంగాన్ని రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే అప్రమత్తం చేశారు. విపత్తులో గాయపడి, నిరాశ్రయులైన వారికి సహాయక చర్యలందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.