చేరిన కొద్ది రోజులకే సచివాలయ ఉద్యోగుల రాజీనామాలు

Published: Friday December 06, 2019
 à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ గ్రామ, వార్డు సచివాలయాల్లో 1579 పోస్టులు మిగిలిపోయినట్లు అధికారులు లెక్క తేల్చారు. వార్డు సచివాలయ పోస్టులకు ఆరు విడతల్లోనూ.. గ్రామీణ పోస్టులకు ఐదు విడతలుగా అధికారులు భర్తీ ప్రక్రియను పూర్తిచేశారు. నిజానికి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పోస్టులు 11,380 భర్తీ కావలసి ఉంది. గ్రామ సచివాలయాల్లో 1366, వార్డుల్లో 213 పోస్టులు మిగిలిపోయాయి. ఆరు, ఏడు విడతల్లో మరోసారి భర్తీ ప్రక్రియ చేపట్టినా.. à°ˆ పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు కన్పించడం లేదు.
 
అర్హత కలిగిన (రిజర్వేషన్‌ ప్రకారం) అభ్యర్థులు లేకపోవడంతో భర్తీ చేయలేకపోయామని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా వార్డుల్లో శానిటేషన్‌- ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, ప్లానింగ్‌- రెగ్యులేషన్‌ సెక్రటరీ పోస్టులు 65, 67 చొప్పున అధికంగా మిగిలిపోయాయి. à°ˆ రెండు పోస్టులకు ఓసీ- మహిళ, బీసీడీ- మహిళ విభాగంలో పోస్టులు మిగిలిపోయినట్లు చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ చల్లా ఓబులేశు తెలిపారు. ఓసీ మహిళ విభాగంలో మిగిలిపోయిన పోస్టులను ఇతర కేటగిరీల అభ్యర్థులతో భర్తీ చేయాలంటే వారు కచ్చితంగా 60 మార్కులు (ఓసీ విభాగానికి అర్హత మార్కులు) సాధించి ఉండాలి. ఇదే విధంగా బీసీ-à°¡à±€ మహిళ విభాగంలోని పోస్టులను భర్తీ చేయాలన్నా.. ఇతర కేటగిరీల అభ్యర్థులు 52.5 అర్హత మార్కులు సాధించి ఉండాలి. ఇలాంటి అభ్యర్థులు లేకపోవడమే దీనికి కారణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొందని సమాచారం.
 
సచివాలయాల్లో ఉద్యోగం పొంది.. కొద్దిరోజులు పనిచేశాక కొందరు రాజీనామా చేస్తుండడం గమనార్హం. à°ˆ కారణంగానూ పోస్టులు మిగిలిపోతూనే ఉన్నాయి. వార్డు సచివాలయాల్లోనే 64 మంది ఇలా రాజీనామా చేసేశారు. ఇదే పరిస్థితి గ్రామ సచివాలయాల్లోనూ ఉంది. ఇలా ఖాళీలు ఏర్పడిన పోస్టులను తదుపరి విడతల్లో భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. మహిళా పోలీసు ఉద్యోగాలకు చాలా మంది అభ్యర్థులు ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగంలో చేరాక కూడా.. ‘అవకాశం ఉంటే నా మార్కుల ఆధారంగా మరో ఉద్యోగానికి బదిలీ చేయండి’ అంటూ కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు.