ఉదయాన్నే ఇంటిని దాటి గడగడలాడుతూ లైను

Published: Friday December 06, 2019
మగువ కోసం, మణులు, రత్నాల కోసం పోరాటాలు చేశారు. చివరకు పశువులు తినే గడ్డి కోసం, మనుషులు తాగే నీటి కోసమూ యుద్ధాలు చేసుకొన్నారు. రాష్ట్రంలో ఎగసిపడుతున్న ‘ఉల్లి’ పోరు సెగలు అలాంటి యుద్ధ వాతావరణాన్నే ఇప్పుడు తలపింపజేస్తున్నాయి. కాలే నూనెలో పడిన ఉల్లిముక్కలతో వ్యాపించే ఘుమఘుమలకు వంటిల్లు దూరమయి, పాయల కోసం రాష్ట్రానికి రాష్ట్రమే కాగిపోతున్న పరిస్థితి! క్యూలైన్లలో అంతకంతకూ పెరిగిపోతున్న తొక్కిసలాటలు కుమ్ములాటలు! వాటిని అదుపు చేయడానికి కొన్ని రైతుబజార్లలో గాలిలోకి లాఠీలూ లేస్తున్నాయి. కుటుంబానికి కిలో చొప్పున ఉల్లి ఇచ్చే రైతుబజార్లకు పోలీసులు కాపలా కాస్తున్నారు. క్యూలైన్లలో రాయితీ ఉల్లి కోసం గొడవలు పెరగడంతో, మగవారికి, ఆడవారికి వేర్వేరుగా పోలీసులు లైన్లు ఏర్పాటుచేస్తున్నారు. సెప్టెంబర్లో క్వింటా రూ. 2500-4400 ఉన్నది, గురువారం నాటికి రూ.13వేలకు చేరుకోవడంతో, ప్రభుత్వానికే కళ్లు తిరుగుతున్నాయి.
 
 
à°ˆ పరిస్థితుల్లో ఉదయం చలిలో బయలుదేరినవాళ్లకు ఏ రాత్రికో గుప్పెడు పాయలు దొరికితే గొప్ప! పట్టుబట్టి, లైను కట్టి రెండు రోజులు పనులు పక్కనపెడితేనే à°† మాత్రం భాగ్యం! ఉల్లి పంటకు కర్నూలు జిల్లా అడ్డా. అలాంటి జిల్లాలో దశాబ్దాలుగా కనని ధరలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్వింటాల్‌ రూ.12,850లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే.. కిలో రూ.128.50. అది హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి రిటైల్‌ మార్కెట్‌.. అక్కడ నుంచి వినియోగదారులకు చేరేసరికి కిలో రూ.140 దాటుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో ఉల్లి రూ.15 పలకగా, అది ఒక్కసారిగా రూ.150 మార్క్‌ కోసం పరుగులు పెట్టేస్తోంది. కర్నూలు మార్కెట్‌యార్డులో మూడ్రోజులుగా రూ.12వేల వద్ద ఉన్న రేటు, గురువారం ఉదయానికి రూ.13,010à°•à°¿ చేరింది. ఇది ఆల్‌టైమ్‌ రికార్డు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పది రోజుల్లో క్వింటాల్‌ ధర రూ.15 వేలు మార్క్‌ను దాటేసినా ఆశ్చర్యపడనక్కర్లేదని అధికారుల అంచనా వేస్తున్నారు.
 
దీంతో à°“ పక్క సామాన్యులు కొనుగోళ్లకు భయపడుతుంటే.. వ్యా పారులు మాత్రం వేలాలకు పోటీలు పడుతున్నారు. రైతుబజార్ల కోసం అధికారులు à°ˆ వేలాలకు మించి పాడి రైతుల నుంచి పంటను తీసుకొంటున్నారు. నిన్నటిదాకా ఉల్లి à°…à°‚ టే పలికేవారు లేని పరిస్థితి, ఇప్పుడు బస్తాను బండిలోంచి దించకముందే బేరాలు అయిపోతున్న పరిస్థితి! మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వరదల వల్ల ఉల్లి దెబ్బతినగా, కర్నూలులో à°ˆ ఏడాది à°† రాష్ట్రాలతో పోల్చితే మంచి పంటే రైతు చేతికి అందింది. డిమాండ్‌ బాగా ఉండటంతో ఉదయం వచ్చిన ఉల్లి బస్తాలు మధ్యాహ్నానికే సగం ఖాళీ అవుతున్నాయి. రోజుకు వంద టన్నులు తగ్గకుండా కొనుగోళ్లు చేసి రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర రైతు బజార్లకు అధికారులు మళ్లిస్తున్నారు. కొద్ది వారాలుగా అక్కడి నుంచి తాడేపల్లి గూడెం, హైదరాబాద్‌ మార్కెట్‌ యార్డులకు తరలిస్తున్నారు. à°ˆ క్రమంలో వ్యాపారులు పోటీలకు దిగడంతో అధికారులకు నిత్యం వంద టన్నులు దొరకడమే కష్టంగా మారింది.