మోదీని అడ్డుకోలేరు..

Published: Sunday December 22, 2019
 à°­à°¿à°¨à±à°¨à°¤à±à°µà°‚లో ఏకత్వమే భారతదేశానికి బలమని, అదే దేశ ప్రత్యేకత అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఢిల్లీలోని కొన్ని పార్టీలు తప్పుడు హామీలు ఇస్తూ, ప్రజలను మోసగిస్తున్నాయని, తాము మాత్రం ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని అన్నారు. రామ్‌లీలా మైదానంలో ఆదివారంనాడు నిర్వహించిన భారీ ర్యాలీలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మోదీ శ్రీకారం చుట్టారు.
 
 
ఆమ్ ఆద్మీ సర్కార్‌పై మోదీ పరోక్ష విమర్శలు గుప్పించారు. వారికి బంగళాలు ఉంటే, తమ వెనుక సామాన్య ప్రజానీకం ఉందని అన్నారు. బంగ్లాలో ఉన్న మిత్రుల కష్టాలనే ఇక్కడి పాలకులు (ఆప్) పట్టించుకుంటున్నారని అన్నారు. తాము మాత్రం సామాన్య ప్రజానీకాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. వారికి ధనికులే వీఐపీలైతే, సామాన్య ప్రజలే తమకు వీఐపీలని అన్నారు. ధనిక మిత్రులకు బంగ్లాలు కట్టబెడుతున్నారని, తాము మాత్రం సామాన్య ప్రజానీకం కోసం ఇక్కడి కాలనీలను క్రమబద్ధీకరిస్తామని వాగ్దానం చేశారు.
 
 
మోదీని ఢిల్లీలోని పార్టీలేవీ అడ్డుకోలేవని, 1,700 కాలనీలకు హద్దులు నిర్ణయించామని, 40 లక్షల మంది ప్రజలు ఇప్పుడు సొంత భూములు కలిగి ఉన్నారని అన్నారు. ఢిల్లీలో రవాణా స్థితిగతులు దయనీయంగా ఉన్నాయని అన్నారు. తాము మెట్రో నెట్‌వర్క్ విస్తరణ జరిపామని చెప్పారు. తాగునీరు నాణ్యతపై కూడా ఆప్ సర్కార్ అబద్ధాలు చెబుతోందని అన్నారు.
 
పౌరసత్వ సవరణ బిల్లుపై కూడా ఆప్ తప్పుడు ప్రచారం చేస్తోందని మోదీ మండిపడ్డారు. సీఏఏపై ఆప్ తప్పుడు వీడియోలు సర్క్యులేట్ చేస్తోందన్నారు. పార్లమెంటును గౌరవించాలని, ఉభయసభలూ బిల్లుపై ఆమోదముద్ర వేశాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. తప్పుడు వీడియోలు తెచ్చిన పాపానికి ఆప్‌ను ప్రజలే శిక్షించాలని, తప్పుడు ప్రచారాలు సాగిస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని ప్రధాని పిలుపునిచ్చారు. బీజేపీ అగ్రనేతలు విజయ్ గోయెల్, మనోజ్ తివారీ, ప్రకాష్ జవదేకర్, గౌతమ్ గంభీర్‌తో పాటు అశేష జనవాహిని à°ˆ ర్యాలీలో పాల్గొన్నారు.