‘మూడు’లో అమరావతి పాత్ర నామమాత్రం

Published: Sunday December 22, 2019
అమరావతి’ భవిష్యత్తుపై తీవ్ర అయోమయం నెలకొంది. దీని ప్రత్యక్ష ప్రభావం అందరికంటే ముందు పడేది భూములిచ్చిన రైతులు, అక్కడ ప్లాట్లు కొన్న వారిపైనే! ఇక... అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కాకుండా సంవత్సరంలో 20 రోజులకు మించి జరగని శీతాకాల, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు, హైకోర్టు ధర్మాసనానికి, సీఎం క్యాంప్‌ కార్యాలయానికి మాత్రమే పరిమితం చేస్తే పరిస్థితి ఏమిటి? వేల కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణాలు, ప్రాజెక్టులన్నీ వృథాయేనా? à°† ఖర్చు బూడిదలో పోసిన పన్నీరేనా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం అనుసరించాల్సిన విధానం ఇదేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఇప్పటి వరకూ అక్కడ చేపట్టిన పలు ప్రాజెక్టులపై వెచ్చించిన సుమారు రూ.6,000 కోట్ల ప్రజాధనం నిరర్థకమైనట్లే. ఇవికాక, ఇప్పటికే కాంట్రాక్టులు ఖరారైన మరో రూ.10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. సుమారు రూ.26,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరమే. ఆయా పనుల కోసం వందలాది నిపుణులు, అధికారులు, వేలాది కార్మికుల మేధస్సు, శ్రమ వృథా కానుంది.
 
అమరావతిలోని ‘మధ్యంతర ప్రభుత్వ సముదాయం’లో భాగంగా వెలగపూడిలో సచివాలయం, శాసన సభ, మండలి భవనాలను నిర్మించారు. జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌లో హైకోర్టును ఏర్పాటు చేశారు. à°…à°–à°¿à°² భారత సర్వీసు (ఏఐఎస్‌) అధికారులతోపాటు గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోలు, 4à°µ తరగతి ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం సుమారు 4వేల ఫ్లాట్లతో కూడిన 53 భారీ టవర్ల నిర్మాణం చేపట్టారు. వీటి నిర్మాణం 60 నుంచి 70 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని శాసనసభ శీతాకాల సమావేశాలకు మాత్రం వాడుకునే అవకాశముంది. ఇక... హైకోర్టులో ధర్మాసనాన్ని ఏర్పాటు చేయవచ్చు. వీటిని పక్కనపెడితే... మిగిలిన నిర్మాణాలు, అభివృద్ధి పరిచిన రోడ్లు, మౌలిక సదుపాయాలకోసం వెచ్చించిన సొమ్ము వృథా అవుతుంది.