విశాఖవాసుల్లో భిన్నాభిప్రాయాలు

Published: Wednesday January 22, 2020
రాష్ట్ర పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రకటించడంపై నగరవాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలనా రాజధానిగా విశాఖ నగరాన్ని ప్రకటించడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని కొందరు అభిప్రాయ పడుతుండగా, ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు ఏమీ లేదని మరికొంతమంది చెబుతున్నారు. పరిపాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం కాదని కొందరంటుండగా, రాజధాని అన్న పేరే నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. నగరాభివృద్ధికి ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేయాలని కొందరు సూచిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని, అందుకు అనుగుణంగానే ఐటీ, ఫార్మా వంటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు.
 
పరిపాలనా వికేంద్రీకరణ వల్ల పాలనా సౌలభ్యం తప్ప అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధి చెందిన, దేశంలోనే ప్రత్యేకత కలిగిన నగరంగా విశాఖకు గుర్తింపు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పాలనా రాజధానిగా నగరాన్ని ప్రకటించడం వల్ల కొత్తగా జరిగే అభివృద్ధి ఏమీ ఉండదని మరి కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. à°ˆ నిర్ణయం వల్ల కొన్ని వర్గాలకు పనులు దొరక్క ఇబ్బంది పడే అవకాశముందే తప్ప, కొత్తగా ఉపాధి అవకాశాలు రావన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ’రాజధాని’ అన్న భావనతో కొత్తగా పరిశ్రమలను à°ˆ నగరంలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తేనే తప్ప, సాధారణంగా అయితే ఎటువంటి ప్రయోజనమూ ఉండదని కొందరు పేర్కొంటున్నారు.
 
 
పాలనా రాజధానిగా విశాఖ నగరాన్ని ప్రకటించడానికే పరిమితం కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. రాష్ట్రంలో ఏ నగరానికి లేనన్ని ప్రత్యేకతలు విశాఖ నగరానికి ఉన్నందున వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయాలని పలువురు సూచిస్తున్నారు. పర్యాటకంగా నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయడం వల్ల ఈ రంగంలో ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అవకాశం ఉంది.
 
పర్యాటకంగా నగరం జోరందుకుంటే హోటల్స్‌కు డిమాండ్‌ ఏర్పడుతుందని, తద్వారా అందులోను ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇప్పటికే విశాఖ నగరం ఐటీ హబ్‌à°—à°¾ రూపాంతరం చెందిన నేపథ్యంలో దీనిని మరింత ముందుకు తీసుకెళ్లడం వల్ల ఉత్తరాంధ్రలో వేలాది మంది యువతకు ఐటీ రంగంలో అద్భుత అవకాశాలను అందించేందుకు అవకాశం ఉంది. అదే విధంగా హైదరాబాద్‌ తరువాత ఫార్మా à°°à°‚à°—à°‚ ఎక్కువగా ఉన్న విశాఖలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేయాలి. నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగితే ఉత్తరాంధ్ర నుంచి వలసలు పూర్తిగా ఆగిపోతాయని, à°† దిశగా కొత్త నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టడం ద్వారా మరింత మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పించేందుకు అవకాశముందని పలువురు చెబుతున్నారు.