హెరిటేజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

Published: Thursday January 23, 2020
 à°œà°¾à°¤à±€à°¯ మీడియా సంస్థ ఏఎన్‌ఐకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చారు. à°ˆ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందన్న వైసీపీ ఆరోపణలకు సమాధానమేంటని ఏఎన్‌ఐ ప్రతినిధి చంద్రబాబును ప్రశ్నించారు. à°ˆ ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ... వైసీపీ అధికారంలోకి వచ్చి 8 నెలలయిందని.. అవినీతి జరిగితే ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడినట్టుగా ఏవైనా ఆధారాలున్నాయా అని చంద్రబాబు నిలదీశారు.
 
 
 
వైసీపీ పదేపదే హెరిటేజ్‌ గురించి మాట్లాడుతోందని.. హెరిటేజ్ సంస్థ చేసిన తప్పేంటేని ఆయన సూటిగా ప్రశ్నించారు. నాగార్జున యూనివర్సిటీకి సమీపంలో కొంత భూమిని హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిందని, అందులో తప్పేముందని ఆయన అడిగారు. హెరిటేజ్ కంపెనీ కొన్న భూమి క్యాపిటల్ రీజియన్ పరిధిలో లేదని స్పష్టం చేశారు. హెరిటేజ్ సంస్థ వ్యాపార విస్తరణ నిమిత్తం దేశంలోని పలు ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసిందని, ఇందులో వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన సమస్యేంటని ఆయన ప్రశ్నించారు. హెరిటేజ్ అక్రమాలకు పాల్పడినట్టు రుజువు చేయాలని జగన్‌కు చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు.
 
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సరస్వతి సిమెంట్స్, తన సొంత మైనింగ్ కంపెనీలకు మేలు చేకూర్చే విధంగా స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకున్నారని.. à°ˆ విషయంలో జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను అధికారంలో ఉండగా హెరిటేజ్‌కు లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.