గ్రూప్‌-1’పై ఏపీపీఎస్‌సీని నిలదీసిన హైకోర్టు

Published: Tuesday January 28, 2020
‘120 ప్రశ్నల్లో 51 తప్పులా? ఇదేం పరీక్ష? ఇదేం నిర్వహణ? నిపుణులు ఏం చేస్తున్నారు? à°† ప్రశ్నపత్రాన్ని ఎలా రూపొందించారు... ఎలా అనుమతించారు? ఇన్ని తప్పులతో రూపొందే ప్రశ్నపత్రంతో à°† గ్రూప్‌-1 పరీక్ష నిర్వహించడమెందుకు?’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎ్‌ససీ)ని హైకోర్టు నిలదీసింది. మళ్లీ తాజాగా పరీక్ష నిర్వహించడానికి ఏమైనా సమస్య ఉందా అని ఆరా తీసింది. అంతేగాక à°ˆ వ్యవహారంపై తదుపరి ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏపీపీఎ్‌ససీని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. à°ˆ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
 
 
రాష్ట్రంలో 169 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం 2018 డిసెంబరు 31à°¨ ఏపీపీఎ్‌ససీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరీక్ష సమయంలో కాలిక్యులేటర్‌ను అనుమతిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నా.. అనుమతించలేదు. ప్రశ్నపత్రంలో 51 తప్పులు దొర్లాయి. దీనిని సవాల్‌ చేస్తూ అభ్యర్థి షేక్‌ షానవాజ్‌తో పాటు మరో 14 మంది హైకోర్టును ఆశ్రయించగా, ఫలితాల విడుదలపై సింగిల్‌ బెంచ్‌ స్టే విధించింది. అయితే ఏపీపీఎ్‌ససీ దీనిని సవాల్‌ చేయగా మరో సింగిల్‌ బెంచ్‌ స్టే వెకేట్‌ చేసింది. దీంతో ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. దీనిని సవాల్‌ చేస్తూ షేక్‌ షానవాజ్‌ బృందం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. à°ˆ పిటిషన్‌పై సోమవారం ధర్మాసనం ముందు విచారణ జరిగింది.