‘అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే ఎలా?

Published: Sunday February 02, 2020
‘అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే ఎలా? రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేయాలిగా?’’.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో పాటు ఆయన మందీమార్బలం చేస్తున్న వాదన ఇది! à°ˆ వాదన నిజమేనని నమ్మాలంటే అభివృద్ధికి నిర్వచనం ఏమిటో వాళ్లు ముందుగా వివరించాలి. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి అయ్యాయి. రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం మచ్చుకు కూడా కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలను వివిధ ప్రాంతాలలో పెట్టడం ద్వారా అభివృద్ధి జరిగిపోతుందని చెప్పడం ప్రజలను వంచించడమే అవుతుంది.
 
మూడు రాజధానుల నిర్ణయంపై ఇంటా–బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ జగన్‌ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా à°ˆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై తాజాగా ఎదురు దాడులు మొదలెట్టారు. ప్రభుత్వపరంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే ప్రైవేట్‌ పెట్టుబడులను పెద్దఎత్తున ప్రోత్సహించినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. à°—à°¡à°¿à°šà°¿à°¨ ఎనిమిది నెలల కాలంలో జగన్మోహన్‌రెడ్డి à°ˆ దిశగా ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో à°—à°¤ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను కూడా రద్దు చేశారు.
 
à°ˆ పరిణామంతో జాతీయ, అంతర్జాతీయ వేదికలలో ఆంధ్రప్రదేశ్‌ చర్చనీయాంశం అయ్యింది. దావోస్‌లో ప్రతి ఏటా అంతర్జాతీయ ఆర్థిక సదస్సు జరుగుతూ ఉంటుంది. గతంలో చంద్రబాబు à°ˆ సదస్సులో స్వయంగా పాల్గొని ప్రైవేట్‌ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేసేవారు. à°ˆ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ఒకరిద్దరు సాదాసీదా అధికారులు మాత్రమే పాల్గొన్నారు. తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌ పాల్గొని పెట్టుబడిదారులతో సమావేశమై సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌à°—à°¾ నిలిచారు. పెట్టుబడుల ఆకర్షణకు దావోస్‌లో ఆయన చేసిన కృషిని వివరిస్తూ పత్రికలలో పలు వార్తలు వచ్చాయి.
 
à°ˆ సందర్భంగా కేటీఆర్‌తో పాటు వెళ్లిన బృందంలోని సభ్యులు à°’à°• విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దావోస్‌ సదస్సులో పాల్గొన్న పలువురు ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇలా ఎందుకు జరుగుతోంది? అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రాన్ని ఎందుకు దెబ్బతీసుకుంటున్నారు?’’ వంటి ప్రశ్నలు పదే పదే అడిగారట. దీన్నిబట్టి అంతర్జాతీయ వేదికలపై కూడా ఆంధ్రప్రదేశ్‌ పరువు పోయిందని భావించాల్సి ఉంటుంది. అయినా మూడు రాజధానుల నిర్ణయాన్ని జాతీయ స్థాయిలో ప్రశంసిస్తున్నారని జగన్‌ అండ్‌ కో ఆత్మవంచన చేసుకుంటోంది. ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి జరుగుతుంటే ముందుగా భూముల ధరలు పెరుగుతాయి. క్రయ విక్రయాలు జోరుగా సాగడం వల్ల ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది.
 
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు à°ˆ పరిస్థితి రివర్స్‌లో వెళుతోంది. రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోవడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు పడిపోయాయి. హైదరాబాద్‌లో 30 ఏళ్లుగా à°’à°• ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్న à°’à°• మిత్రుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత స్వరాష్ట్రమైన ఏపీలో స్థిరపడాలనుకున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనించిన ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుని హైదరాబాద్‌లోనే స్థిరపడాలనుకుంటున్నారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో తమకున్న భూమిలో రెండెకరాలను ఆయన అమ్ముదామనుకున్నారు. ఎనిమిది నెలల క్రితం వరకు à°Žà°•à°°à°‚ 60 లక్షల రూపాయల ధర పలికిన తమ భూమిని ఇప్పుడు 30 లక్షల రూపాయలకు కూడా కొనడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.