బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్...... రాహుల్ గాంధీ

Published: Thursday May 17, 2018

రాయ్‌పూర్: కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తోంటే మన దేశంలో ఉన్నామా, పాకిస్థాన్‌లో ఉన్నామా అనే ఆందోళన కలుగుతోందని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ విమర్శించారు.

గురువారం నాడు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారత్ పేద దేశం కాదు, డబ్బంతా కొందరి చేతుల్లోనే ఉందన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ వ్యవస్థలకు మనుగడ లేకుండా చేస్తున్నాయని అని తీవ్రస్థాయిలో రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

బిజెపి ప్రతిసారీ అవినీతి గురించి మాట్లాడుతుందని చెప్పారు. రాఫెల్ ఒప్పందం, అమిత్ à°·à°¾ కుటుంబంలోని అవినీతి గురించి కూడా తప్పక మాట్లాడాలని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.   Image result for rahul gandhi images

గురువారం రాహుల్ మరో రెండు ర్యాలీల్లో కూడా పాల్గొననున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల అజెండాను ఈ సందర్భంగా ప్రస్తావించారు. విద్య, వైద్య రంగాన్ని బలోపేతం చేయడం, ఉద్యోగ కల్పనే లక్ష్యాలుగా తమ పార్టీ ముందుకెళ్తుందన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో బిజెపి నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమ కూటమికి మెజారిటీ ఉన్నప్పటికీ గవర్నర్ బిజెపికి అవకాశం కల్పించడం పట్ల రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని రాహుల్ వ్యాఖ్యానించారు.