కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఉరి

Published: Wednesday February 12, 2020

కరోనా వైరస్‌ సోకిందన్న అనుమానంతో à°“ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల కఽథనం మేరకు ...తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగ అరుంధతివాడకు చెందిన కె.బాలకృష్ణయ్య (50) వ్యవసాయ కూలీ. భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.బాలకృష్ణయ్య ఏడాదినుంచి గుండె సంబంధిత వ్యాధితో భాదపడుతూ వైద్యం చేయించుకుంటున్నాడు. à°ˆ నెల మొదటి వారంలో తన మామ అనారోగ్యంతో తిరుపతి రుయాస్పత్రిలో చేరగా చూసేందుకు వెళ్లి అక్కడ కూడా వైద్యపరీక్షలు చేయించుకున్నాడు. వైద్యులు మూత్ర సంబంధిత వ్యాధితో పాటు నోటి అల్సర్‌ ఉన్నట్లు చెప్పారు. అయితే బాలకృష్ణయ్య తనకు ఏదో తెలియని వైరస్‌ సోకిందని భావించాడు. ఇది కరోనా వైరస్‌ అయి ఉంటుందేమో అని భయపడ్డాడు.ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఆయన తనకు కరోనా వైరస్‌ సోకిందని... ఎవరూ ముట్టుకోవద్దంటూ కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగువారిని హెచ్చరించాడు. రాత్రి కుటుంబ సభ్యులు నిద్రపోయాక బాలకృష్ణయ్య ఇంటి తలుపుకు à°—à°¡à°¿à°¯ పెట్టి గ్రామ సమీపంలోని స్మశానంలో ఉన్న తన తల్లి సమాధి పక్కనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి చేసేదిలేక దహన క్రియలు నిర్వహించారు.

 

à°ˆ విషయం తెలుసుకున్న వైద్యాధికారిణి అనూష సిబ్బందితో కలసి బాలకృష్ణయ్య నివాసం వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులను విచారించారు. రుయాస్పత్రిలో వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను అడిగారు. à°† రిపోర్టులను కూడ కాల్చివేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వైద్యాధికారిణి మాట్లాడుతూ బాలకృష్ణయ్యకు కరోనా వైరస్‌ సోకినట్లు ఆధారాలు లేవన్నారు. కొంత కాలంగా ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. à°ˆ నేపథ్యంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.à°ˆ మేరకు నివేదికను కూడ ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.