పుల్వామా దాడి లబ్ధిదారులెవరు?రాహుల్‌గాంధీ

Published: Thursday February 20, 2020

పుల్వామా దాడి జరిగి ఏడాది à°—à°¡à°šà°¿à°¨ సందర్భంగా, మృతవీరులకు నివాళి అర్పించే బదులు, పోనీ, మరణించిన సైనికుల కుటుంబాలకు వాగ్దానం చేసిన సహాయాలు అందాయో లేదో తెలుసుకునే బదులు, రాహుల్‌గాంధీ à°’à°• పెడసరపు వ్యాఖ్య చేశారు. పుల్వామా దాడి లబ్ధిదారులెవరు?- అని à°† వ్యాఖ్యలో ప్రశ్నించారు. పుల్వామా దాడి లాగానే à°† ప్రశ్న కూడా రాహుల్‌కు చాలా నష్టం చేసింది. సమయం సందర్భం చూసుకుని మాట్లాడాలని, ఔచిత్యం లేని మాటలు అధికప్రసంగాలు అవుతాయని పెద్దలు అందుకే అంటారు. రాహుల్‌గాంధీ తన వ్యాఖ్య ద్వారా ఏమి స్ఫురింపజేయదలచుకున్నారో అందరికీ అర్థమవుతూనే ఉన్నది. మనకు స్ఫురించే ఆరోపణ, నిజమా కాదా ఇక్కడ అనవసరం. నిజమే అయినప్పటికీ, à°† నిజాన్ని స్వీకరించి స్పందించే స్థితిలో భారతీయ ఓటర్లు లేరు అన్నది రాహుల్‌గాంధీకి తెలిసి ఉండాలి. ఎవరో ఒకాయన అడిగాడు కూడా, 2008లో బొంబాయి దాడులు జరిగాయి, 2009లో యుపిఎ గెలిచింది, రెంటికీ ముడిపెట్టి చూడాలా? అని. బిజెపివారిని నిలదీస్తే, కాంగ్రెస్‌ మీద ఎదురు ప్రశ్న సంధించడం- సమాధానం కాదు. రాజకీయ ప్రయోజనాల కోసం, దేశభద్రతను తాకట్టు పెట్టడం, లేదా, ఉగ్రవాదుల సాయం తీసుకోవడం, లేదా స్వయంగా నకిలీ దాడులు జరపడం- ప్రపంచంలో లేనిదేమీ కాదు. భారతదేశంలో కూడా అటువంటి ధోరణి ఉన్నదా, మన రాజకీయపార్టీలు à°† స్థితికి దిగజారాయా, దిగజారినా à°† విషయం విశ్వసించడానికి సమాజం సిద్ధంగా ఉన్నదా- అన్నవి ప్రశ్నలు. 

 

ఇంటిలోని సమస్యలకు పొరుగును నిందించడం ఎప్పటి నుంచో ఉన్నది. అదే సమయంలో ఇరుగు దేశాలలో చిచ్చుపెట్టడం పొరుగుకు కూడా పాత విషయమే. దేశంలో తనపై అసంతృప్తి పెరగడాన్ని జీర్ణించుకోలేని ఇందిరాగాంధీ తరచు విదేశీహస్తాన్ని ప్రస్తావించేవారు. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో జరిగిన ప్రజాందోళనను కూడా ఆమె విదేశీకుట్రగా వ్యాఖ్యానించారు. జెపిని సిఐఎ ఏజెంటు అని నిందించడం కూడా à°† రోజుల్లో జరిగింది. నక్సలైట్లను కూడా నిక్సనైట్లు అని ఆరోపించినవారున్నారు. బంగ్లాదేశ్‌ యుద్ధం, పోఖ్రాన్‌ అణుపరీక్ష వంటివి దేశానికి ఎంతో కీలకమైనవి, ఆవశ్యకమైనవి అయినప్పటికీ, వాటి నిర్ణయం వెనుక ఇందిరకు తన ప్రతిష్ఠను, జనాదరణను పెంచుకునే రాజకీయ ఉద్దేశ్యం కూడా ఉన్నదని పరిశీలకులు భావించేవారు. ఎమర్జెన్సీ అనంతరం ఇందిరాగాంధీలో అనేక మార్పులు వచ్చాయి. ప్రతిదానికీ అమెరికాను నిందించే ఆనవాయితీ మానేసి, పొరుగుదేశంపైనే ఆరోపణలు సంధించడం మొదలుపెట్టారు. ఖలిస్థాన్‌ తీవ్రవాదం, కశ్మీర్‌ సమస్యల విషయంలో పాకిస్థాన్‌తో ఏదో విధమైన లంకె ఉండడంతో, à°† దేశమే మనకు ప్రతినాయక దేశంగా స్థిరపడిపోయింది. ఇటీవలి దశాబ్దాలలోని ఉగ్రవాదచర్యల విషయంలోనూ పాకిస్థాన్‌ ప్రమేయం లేదా పాకిస్థాన్‌ భూభాగంలోని శక్తుల ప్రమేయం ఉంటూనే వస్తోంది. హింసాత్మక, ఉగ్రవాద సంఘటనలు అనేకం వీడని ముడులుగా, అనుమానాస్పదంగా మిగిలిపోయిన మాట నిజమే. కొన్ని సార్లు వివిధ భద్రతా ఏజెన్సీల పాత్ర కూడా చర్చనీయాంశం అవుతుంది. కానీ, à°† అంశాలు ప్రధాన రాజకీయ వేదిక మీదకి రావడానికి ఇంకా సమయం రాలేదు. ప్రజానీకంలో కొన్ని విషయాల మీద గాఢమైన విశ్వాసం ఉంటుంది. à°† విశ్వాసాన్ని నిరంతరం పెంచిపోషించే ప్రక్రియలూ ఉంటాయి.