ఢిల్లీ అల్లర్ల వెనుక పాక్ ఐఎస్ఐ హస్తం..

Published: Wednesday February 26, 2020

కేంద్ర ఇంటలిజెన్స్ ఏజెన్సీ తన రహస్య నివేదికలో దిమ్మతిరిగి పోయే వాస్తవాలు వెలుగుచూశాయి.  à°¦à±‡à°¶ రాజధాని నగరమైన ఢిల్లీలో అల్లర్ల వెనుక పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) హస్తముందని కేంద్ర ఇంటలిజెన్స్ ఏజెన్సీ తన రహస్య నివేదికలో వెల్లడించింది. à°…మెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన విజయవంతం అయిన నేపథ్యంలో మన దేశాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకే పాక్ ఐఎస్ఐ అల్లర్లు రేపి అశాంతి సృష్టించిందని భారత కేంద్ర ఇంటలిజెన్స్ పేర్కొంది. దేశంలో అస్థిరతను రేపేందుకు పాక్ ఐఎస్ఐ అండర్ వరల్డ్, స్లీపర్స్ సెల్స్, సోషల్ మీడియా, వెబ్‌సైట్‌లకు నిధులు సమకూరుస్తుందని ఇంటలిజెన్స్ తేల్చి చెప్పింది.

 

పాకిస్థాన్ నేపాల్, దుబాయ్ దేశాల ద్వారా నకిలీ కరెన్సీని భారతదేశానికి పంపించిందని తాజాగా à°“ కేసులో తేలిందని ఇంటలిజెన్స్ ఉటంకించింది. మన ఒరిజినల్ కరెన్సీని పోలిన నకిలీ నోట్లను పాక్ కరాచీలో ముద్రించి ఐఎస్ఐ అండర్ వరల్డ్ నెట్ వర్క్ సాయంతో దాన్ని దేశంలో చలామణీ చేస్తుంది. దేశంలో అల్లర్లు, హింసాకాండ సృష్టించేందుకు పాక్ ఐఎస్ఐ అనుకూల సానుభూతిపరులు, అక్రమ ముస్లిమ్ వలసదారులను కూడా ఉపయోగించుకుంటుందని ఇంటలిజెన్స్ వివరించింది. దేశంలోని సున్నిత నగరాల్లో సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పీఆర్ సమస్యలపై ముస్లిములతో రాళ్లు రువ్వించి నిరసనలు కొనసాగించడానికి ఐఎస్ఐ నిధులు ఇస్తూ ప్రేరేపిస్తుందని ఇంటలిజెన్స్ వెల్లడించింది.

 

ఢిల్లీలోని జామియానగర్, శీలంపూర్, జాఫ్రాబాద్, ఈశాన్యఢిల్లీలోని జిల్లాల్లో సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా చెలరేగిన అల్లర్లలో ఐఎస్ఐ పాత్రను ఇంటలిజన్స్ పరిశీలిస్తోంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు, అనుమానాస్పద కార్యకలాపాల కోసం చేసిన అనుమానాస్పద ఫోన్ కాల్స్, వెయ్యి వాట్సాప్ గ్రూపులను నిఘా వర్గాలు పరిశీలిస్తున్నాయి. ఢిల్లీతోపాటు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక సంఘటనలు జరిగాయి