సీబీఐకు ప్రీతిబాయి మృతి కేసు

Published: Thursday February 27, 2020

 2017లో ఏపీలో కర్నూలు ప్రీతిబాయి కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. à°ˆ కేసుకు సంబంధించిన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే తాజాగా.. ప్రీతిబాయి అనుమానాస్పద మృతి కేసులో పురోగతి లభించింది. ప్రీతిబాయి కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో నెం.37ను ప్రభుత్వం విడుదల చేసింది. కేసును సీబీఐకి అప్పజెప్పడంతో ప్రీతి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

2017లో స్కూల్లో అనుమానాస్పద స్థితిలో ప్రీతిబాయి ఉరి వేసుకొని మృతి చెందింది. స్కూల్ యజమాన్యమే అత్యాచారం చేసి, తన బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయ్ తల్లితండ్రులు ఆరోపిస్తూ వస్తున్నారు. నాటి నుంచి నేటి వరకూ à°ˆ కేసు పెండింగ్‌లోనే ఉంది. అప్పట్లో à°ˆ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.

 

కాగా.. à°‡à°¦à±‡ విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కర్నూల్‌లో సభ పెట్టి మరీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఇటీవల à°•à°‚à°Ÿà°¿ వెలుగు ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా కర్నూల్ వెళ్లిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రీతి తల్లి కలిసి విషయం చెప్పి.. తమకు న్యాయం చేయాలని కోరింది. దీంతో à°ˆ కేసును సీబీఐకి అప్పగించి న్యాయం చేస్తానని హమీ ఇచ్చారు. అంతేకాదు.. à°ˆ విషయంపై మరోసారి కూలంకషంగా మాట్లాడేందుకు.. తన వద్దకు రావాలని కూడా సూచించారు. అయితే.. అప్పట్లో కేసును సీబీఐకు రెఫర్ చేసిన జగన్ ప్రభుత్వం తాజాగా ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.