యూట్యూబ్ లో ఉచితసేవలకు పెద్ద చిల్లు.....

Published: Friday May 18, 2018

వీడియో షేరింగ్ రంగంలో యూట్యూబ్ ఇప్పటికే టాప్‌లో దూసుకుపోతున్న పోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో పాటు ప్రపంచంలోనే పాపులర్‌ మ్యూజిక్‌ సర్వీసులను అందిస్తున్న యూ ట్యూబ్‌ ఇప్పుడు కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను ప్రకటించింది. ఆన్‌లైన్‌ మ్యూజిక్‌ సెక్టార్‌లో పెరుగుతున్న పోటీని క్యాష్‌ చేసుకునే వ్యూహంలో à°ˆ నెల 22à°¨ దీన్ని అధికారికంగా లాంచ్‌ చేయనుంది. ముఖ్యంగా మ్యూజిక్ స్ట్రీమింగ్ రంగంలో మార్కెట్లను ఏలుతున్న ఆపిల్‌ మ్యూజిక్‌, స్పాటీఫై, సావన్‌, గానా లాంటి సంస్థలకు పోటీగా తాజా యూ ట్యూబ్‌ మ్యూజిక్‌, యూ ట్యూబ్‌ ప్రీమియం అనే రెండు సర్వీసులను లాంచ్‌ చేయనుంది.

లింక్ : ఉచిత వైఫై కనెక్ట్, ఉచిత వైఫై మ్యాప్, అసలేంటి ఇది ?

ఉచితంగా అందిస్తున్నసేవలను..

ఈ సేవలు లాంచ్ తర్వాత యూట్యూబ్ కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ ఉచితంగా అందిస్తున్నసేవలను లాంచ్ తరువాత సభ్యత్వ ఆధారిత సేవలుగా మారుస్తోంది.

రీబ్రాండింగ్ చేయడం ద్వారా ..

దీంతో పాటు మ్యూజిక్‌ సేవలను రీబ్రాండింగ్ చేయడం ద్వారా ప్రత్యర్థి సంస్థలకు సవాల్‌ విసురుతోంది. యూట్యూబ్ సంస్థ తీసుకు వస్తున్న యూ ట్యూబ్‌ మ్యూజిక్‌లో కేవలం ఆడియో మాత్రమే ప్లే అయ్యే విధంగా ప్లాన్‌ చేసింది. దీంతో బ్యాండ్‌విడ్త్ ఆదా అవుతుందని సంస్థ భావిస్తోంది.

మ్యూజిక్ స్ట్రీమింగ్ చేయడం కోసం..

అలాగే కేవలం యూట్యూబ్‌లో ఉన్న వీడియోలు మాత్రమే కాదు, ఇతర పెద్ద మ్యూజిక్ కంపెనీల నుండి మ్యూజిక్ స్ట్రీమింగ్ చేయడం కోసం యూట్యూబ్ సంస్థ హక్కులను కొనుగోలు చేసింది. అంటే à°† పాటలన్నింటిని à°ˆ సర్వీస్ ద్వారా ప్లే చేసుకుని వినవచ్చన్నమాట.

నెలకు సుమారు 680 రూపాయలు

à°ˆ సేవలను పొందాలంటే యూజర్లు కొత్త సర్వీసులను సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నెలకు సుమారు 680 రూపాయలు(10-12 డాలర్లు) ఖర్చు పెట్టవలసి ఉంటుంది.

యాడ్‌ ఫ్రీగా వీక్షించాలనుకునే వారికి..

ఇక యూట్యూబ్‌ వీడియోను యాడ్‌ ఫ్రీగా వీక్షించాలనుకునే వారినుద్దేశించి తీసుకొస్తున్న మరో ఆప్షన్‌ ప్రీమియం సర్వీసు. à°ˆ సర్వీసు కూడా సబ్‌స్క్రిప్షన్‌ ఆధారంగానే పనిచేస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, మెక్సికో, దక్షిణ కొరియాలో à°ˆ సేవలను మొదటగా ప్రారంభిస్తుంది. త్వరలోనే ఇతర దేశాల్లో కూడా దీనిని ఆవిష్కరించనుంది.