నంది అవార్డుల ప్రదానానికి లైన్ క్లియర్

Published: Tuesday June 09, 2020

నంది అవార్డుల ప్రదానానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినీ నటుడు చిరంజీవి నేతృత్వంలో సీఎం జగన్‌ను కలిసిన బృందానికి ఆయన à°ˆ విషయాన్ని స్పష్టం చేశారు. 2019-20 సినిమాలకు నంది అవార్డులను ప్రకటించాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు చిరంజీవి చెప్పారు. అవార్డుల వేడుక కూడా జరుగుతుందని ఆయన ఆశించారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ చలన చిత్రాలకు ఏటా ప్రభుత్వం నంది అవార్డులను ప్రదానం చేసేది. రాష్ట్ర విభజనకు ముందు రెండేళ్లపాటు à°ˆ కార్యక్రమం నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీవ్రస్థాయిలో ఉద్యమాలు జరగడంతో ప్రభుత్వం నంది అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని వాయిదా వేసింది.

 

అయితే.. 2017లో 2014, 2015,2016 సంవర్సాలకు గానూ అప్పటి టీడీపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించింది. అయితే.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాకు నంది అవార్డుల కేటాయింపులో పెద్ద పీట వేశారని, ప్రభుత్వం పక్షపాతంతో అవార్డులను ప్రకటించిందని టాలీవుడ్‌లో తీవ్ర విమర్శలొచ్చాయి. రుద్రమదేవి సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వకపోవడమే కాకుండా.. కనీసం జ్యూరీ గుర్తింపుకు కూడా నోచుకోలేకపోయిందని దర్శకుడు గుణశేఖర్ బహిరంగంగానే తన ఆవేదనను వెళ్లగక్కారు. ఇలా.. అవార్డుల ప్రకటనపై వివాదం తలెత్తడంతో నంది అవార్డుల ప్రదానాన్ని అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు జగన్ సర్కార్ నంది అవార్డులను ప్రకటించనున్నట్లు తెలుగు సినీ పెద్దలకు మాటివ్వడం గమనార్హం.