ఆరోగ్య శాఖ కీలక ప్రకటన

Published: Tuesday June 16, 2020

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.. à°—à°¡à°¿à°šà°¿à°¨ 24గంటల్లో 10వేల 215 మంది కరోనా రోగులు కోలుకున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి చికిత్స తీసుకుని కోలుకున్న వారి సంఖ్య à°’à°• లక్షా 80వేల 12 మందికి చేరింది. కోలుకున్న వారి సంఖ్యను బట్టి భారత్ లో కరోనా రికవరీ రేటు.. 52.47శాతంగా ఉంది. ఇంకా లక్షా 53వేల 178 మంది కరోనా రోగులు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. 

 

భారత్ లో ఇప్పటివరకు 3లక్షల 43వేల 91 కరోనా కేసులు నమోదయ్యాయి. 9915 మంది కరోనా భారిన పడి మరణించారు.  అయితే మొత్తం నమోదయిన కేసుల్లో సగానికి పైగా కరోనా రోగులు కోలుకున్నారు. ఇది భారత్ కు శుభ పరిణామం అనీ వైద్య నిపుణులు చెబుతున్నారు. భారతీయుల్లో సహజంగా ఉండే రోగ నిరోధక శక్తి కూడా దీనికి à°“ కారణమవుతోందంటున్నారు. రాబోయే నెలల్లో కరోనా కేసులు తీవ్రమయ్యే అవకాశాలు భారీగా ఉన్నాయనీ.. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటిస్తే కరోనా బారి నుంచి తమను తాము కాపాడుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.