"నాసా "లో ప్రతిభ చూపనున్న కస్తూర్బా గాంధీ విద్యార్ధినులు

Published: Sunday May 20, 2018

"అంతులేని ఆనందం. కానీ ఈ ఆనందాన్ని పంచుకునేందుకు అమ్మానాన్న లేరని దుఖమొచ్చింది."

à°ˆ మాటలు 14 సంవత్సరాల సైదా భానువి. అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సులో పాల్గొనేందుకు అమెరికాలోని జాతీయ అంతరిక్ష కేంద్రం (ఎన్ఎస్‌సీ) నుంచి ఆహ్వానం అందుకున్న ఆంధ్రప్రదేశ్‌à°•à°¿ చెందిన పదకొండు మంది విద్యార్థినుల్లో భాను ఒకరు.

ఇప్పటివరకు కార్పొరేట్ స్కూళ్లకు చెందిన పిల్లలు మాత్రమే ఈ పోటీలకు ఎంపిక అవుతూ వచ్చారు. కానీ తొలిసారిగా ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల విద్యార్థినులు 11 మంది ఈ సదస్సుకు ఎంపికై రికార్డు సృష్టించారు.

à°ˆ 11 మంది à°ˆ నెల 24 నుంచి 27 వరకు లాస్‌ ఏంజెలిస్‌లో జరిగే సదస్సుకు హాజరై, నాసాను సందర్శిస్తారు.జేఈఈ మెయిన్స్ ఫలితాలు: తెలుగువాళ్లే టాపర్లు

 

ఈ సదస్సులో 'అంతరిక్షంలో మానవ జీవనం' అనే అంశంపై ఈ విద్యార్ధులు తమ నివేదికలను సమర్పిస్తారు.

ఈ సదస్సుకు పిల్లలతో పాటు వారి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా హాజరవుతున్నారు.

కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులకు చెందిన బాలికలకు విద్య, వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు. భారత ప్రభుత్వం à°ˆ పథకాన్ని 2004లో ప్రవేశ పెట్టింది. తరువాత à°ˆ పథకం సర్వశిక్ష అభియాన్‌లో విలీనమైంది.

ఈ సదస్సుకు ఎంపికైన విద్యార్థినులు ఎలాంటి శిక్షణ పొందారు, వారికి స్ఫూర్తి ఏమిటో తెలుసుకునేందుకు బీబీసీ కొంతమంది కస్తుర్బా గాంధీ బాలికలతో మాట్లాడింది.

#గమ్యం: సెలవుల్లో ఇంటర్న్‌షిప్ - ఉద్యోగ వేటలో మెరుగైన అవకాశాలు

BBC

సైంటిస్టు కావడమే నా లక్ష్యం: భాను

నాసా సదస్సుకు ఎంపికైన భానుది సంపన్నుల కుటుంబం కాదు. ఆమె బాల్యం వడ్డించిన విస్తరీ కాదు. ఆమె లక్షలకు లక్షలు కట్టి కార్పొరేట్ పాఠశాలల్లో తర్ఫీదూ పొందలేదు.

చిన్నతనంలోనే తల్లితండ్రులను కోల్పోయిన భాను మేనమామ సంరక్షణలో పెరుగుతోంది.

భాను 'అంతరిక్షంలో పరిశ్రమలు' అనే అంశంపై నివేదికను సమర్పించింది. సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న తన మరొక మామయ్య తనకు ఆదర్శం అని, హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూస్తానని భాను తెలిపింది.

సైంటిస్ట్ కావాలనేదే తన జీవితాశయం అని చెబుతున్న భాను... తాను ఇప్పటివరకు జీవితంలో ఏ క్షణంలోనూ ధైర్యాన్ని కోల్పోలేదని చెప్పింది.

BBC

స్టీఫెన్ హాకింగ్ పుస్తకాలే స్ఫూర్తి: ప్రీతి

ఇక బైరెడ్డిపల్లి కేజీబీసీలో చదువుతున్న కే ప్రీతి 'అంతరిక్షంలో నివాస స్థలాలు' అనే అంశంపై నివేదికను సమర్పించింది.

గ్రహశకలాలు భూమిని తాకడం వల్ల రాక్షస బల్లులు అంతరించినట్లుగానే మానవులు కూడా కాలక్రమంలో భూమిపై నివసించే అవకాశాలు కోల్పోతారని, అంతరిక్షంలో నివాస స్థలాలపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని ప్రీతి అభిప్రాయపడింది.

ప్రీతి వివరాల విషయానికి వస్తే, ఆమె చిన్నతనంలోనే తండ్రి గుండెపోటుతో మరణించగా, తల్లి ఒక రోజుకూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పుస్తకాలు, సైన్స్ వీడియోలు, సినిమాలు ఆమెకు స్ఫూర్తి.

ఐఏఎస్ అధికారై, తన చుట్టూ ఉన్న వారికి సేవ చేయాలన్నది ఆమె లక్ష్యం.

నాసా సదస్సుకు ఎన్నికైన విషయం తెలిసిన వెంటనే తన తల్లి ఆనందంతో కన్నీరు పెట్టుకుందని, ప్రీతి తన తల్లి ప్రతిస్పందనని గుర్తు చేసుకుంది. కేవలం రెండు రోజుల్లో ప్రాజెక్ట్ తయారు చేశానని ప్రీతి తెలిపింది.

 

అంతరిక్షంలో ఆహారం పండించొచ్చు: స్నేహ చేతిపత్తి

అంతరిక్షంలో ఆహారం పండించవచ్చు అంటోంది తొమ్మిదో తరగతి చదువుతున్న స్నేహ చేతిపత్తి. ఇదే అంశంపై ఆమె నాసాకి తన పరిశోధనా పత్రాన్ని సమర్పించింది.

అంతరిక్షంలో కూడా ఆహారాన్ని పండించవచ్చని, పరిశోధనశాలల్లో మాంసం తయారు చేయవచ్చనేది స్నేహ నమ్మకం.

స్నేహ తల్లి గృహిణి, తండ్రి అపోలో హాస్పిటల్లో వంట మనిషిగా పని చేస్తున్నారు.

BBC

ఉపగ్రహాన్ని తయారుచేస్తా: రోషిణి షేక్

మరో విద్యార్థిని రోషిణి షేక్ అంతరిక్షంలో వాతావరణ పరిస్థితులపై పత్రాన్ని తయారు చేసింది. సైంటిస్ట్ కావాలన్న ఆశయం ఉన్న రోషిని, తన కలసాకారానికి ఈ సదస్సుకు హాజరుకావడాన్ని పునాదిగా భావిస్తోంది.

రోషిణి తండ్రి ఆటో డ్రైవర్. అసలు నాసా అంటే ఏమిటో ఆమె తల్లిదండ్రులకు తెలీదు. నాసా గురించి, తను సాధించిన విజయం గురించి వారికి వివరించాక, వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారని చెబుతున్నారు రోషిణి.

ఉపగ్రహ తయారీలో భాగం కావాలని, తను రూపొందించిన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలనేది ఆమె కోరిక.

ఈ నలుగురితో పాటు మరో ఏడుగురు బాలికలు అంతరిక్షంలో వ్యవసాయం, రవాణా, మొక్కలు, గాలి, ఉష్ణోగ్రత, ఆకర్షణ శక్తి వంటి అంశాలపై పరిశోధనా పత్రాలను సమర్పించారు.

వాతావరణ మార్పుల కారణంగా మరో 600 సంవత్సరాలలో భూమి మానవులకి నివాసయోగ్యంగా ఉండదనే ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ వాదననే ఈ పిల్లలు కూడా వినిపించనున్నారు.

తమ పిల్లలు సాధించిన ఈ విజయంలో పాలు పంచుకునేందుకు వారి తల్లిదండ్రులు కూడా అమెరికా వెళుతున్నారు. వీరి ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది.

BBC

కేవలం కార్పొరేట్ పాఠశాలల్లో చదివితేనే జ్ఞానం వస్తుంది అనే అపోహని తొలగించాలనే ఉద్దేశంతోనే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల పిల్లలకు నాసా ఎంపిక కోసం శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని ఐఏఎస్ అధికారి, ఏపీ సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీ శ్రీనివాస్ తెలిపారు.

స్టీఫెన్ హాకింగ్ సిద్ధాంతమే తమ ఈ ప్రయత్నానికి పునాది అని ఆయన తెలిపారు.

తగిన ప్రోత్సాహం, శిక్షణ ఉంటే ఎవరైనా విజయాలు సాధించగలరని ఈ బాలికలు నిరూపించారని ఆయన అన్నారు.

à°ˆ పథకాన్ని దశలవారీగా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన జిల్లాలలో కూడా అమలు చేస్తామన్నారు.

 

ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి ఎన్.రఘునందన్ కుమార్ ఈ బాలికలకు 45 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. వీరికి శిక్షణ ఇవ్వడం కష్టమనుకున్న తాను, క్లాస్ మొదలైన గంటలోనే తన అభిప్రాయాన్ని మార్చుకోవలసి వచ్చిందని తెలిపారు.

తెలంగాణలోనూ..

తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థ (టీఎంఆర్‌ఏఐఎస్)లకు చెందిన మరో ఆరుగురు విద్యార్థులు సఫా మహవీన్, సయెద్ ఇబ్రహీం అలీ, మహవీన్ మొహమ్మదీ, ముస్కాన్ తబస్సుమ్, ఫిరోజ్ హుస్సేన్, ఫిరోజ్ అహ్మద్‌లు కూడా à°ˆ సదస్సుకు హాజరవుతున్నారు.

వీరు అంతరిక్షంలో నివాస స్థలాలపై నివేదికలు సమర్పించనున్నారు.

వీరి ప్రయాణానికి అయ్యే ఖర్చులనూ తెలంగాణ ప్రభుత్వం భరిస్తోంది.