జూన్ 8 నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం

Published: Saturday July 04, 2020

టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 8 నుంచి నిబంధనలకు అనుగుణంగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. 6 వేల మంది భక్తులతో మొదలు పెట్టి 12 వేల వరకు సంఖ్యని పెంచామన్నారు. ఇప్పటి వరకూ ఒక్క భక్తుడికి కూడా కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదన్నారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అత్యవసర పాలకమండలి సమావేశం నిర్వహించామని సుబ్బారెడ్డి తెలిపారు. 

 

à°ˆ నెల చివరి వరకు భక్తులు సంఖ్యని పెంచబోమన్నారు. కరోనా సమయంలో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకే టీటీడీ ప్రాధ్యనమిస్తోందన్నారు. ఆదాయం కోసం భక్తుల సంఖ్యని పెంచాం అని కోంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే 17 మంది టీటీడీ ఉద్యోగులు, పూజారులు, సెక్యూరిటి సిబ్బందికీ  కరోనా పాజిటివ్ వచ్చిందని సుబ్బారెడ్డి తెలిపారు. 

 

కాగా.. à°¤à°¿à°°à±à°®à°²à°²à±‹ విధులు నిర్వర్తించడం కారణంగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రాలేదని సుబ్బారెడ్డి తెలిపారు. ఉద్యోగులలో మనోదైర్యాన్ని నింపుతామన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో, ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగుల భధ్రతపై చర్చించడానికి కమిటిని ఏర్పాటు చేస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు.15 రోజుల పాటు ఉద్యోగులు తిరుమలలోనే విధులు నిర్వర్తించేలా మార్పులు చేయాలన్నారు. తిరుమలకు వచ్చే ప్రతి ఉద్యోగికి కరోనా పరిక్షలు నిర్వహించిన అనంతరం అనుమతిస్తామన్నారు. ఆర్జిత సేవలు ఇప్పట్లో నిర్వహించబోమని తెలిపారు. ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవం సేవను భక్తులకు అందుభాటులో తీసుకువస్తామని సుబ్బారెడ్డి తెలిపారు.