కరోనా గురించి ముందుగా చైనా చెప్పలేదు

Published: Saturday July 04, 2020

కరోనా సంక్షోభం తొలినాళ్లలో చైనాలో ఏం జరిగిందనే దానిపై క్రమంగా క్లారిటీ వస్తోంది. అప్పటి పరిస్థితి గురించి ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వుహాన్‌లో కరోనాను పోలిన తొలి నిమోనియా కేసుల గురించి అక్కడి ప్రాంతీయ డబ్ల్యూహెచ్ఓ కార్యలయమే తొలుత గుర్తించిందని తాజాగా తెలిపింది. à°ˆ విషయమై చైనా తనకు తానుగా ఎటువంటి సమాచారం డబ్లూహెచ్ఓకు ఇవ్వలేదని స్పష్టం చేసింది.

 

తొలినాళ్లలో చైనాలో జరిగిన విషయాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా ఏప్రిల్ 9à°¨ à°“ ప్రకటన విడుదల చేసింది. వుహాన్‌లో డిసెంబర్ 31à°¨ కరోనా లాంటి కేసులకు సంబంధించి అక్కడి మున్సిపల్ హెల్త్ కమిషన్ ప్రకటించిందని తెలిపింది. అయితే à°ˆ విషయం డబ్ల్యూహెచ్ఓకు ఎలా చేరిందనేదానిపై మాత్రం అప్పట్లో ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు.

 

à°† తరువాత ఏప్రిల్ 20à°¨ ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ మళ్లీ à°“ ప్రకటన విడుదల చేశారు. కరోనాకు సంబంధించిన తొలి రిపోర్టు చైనా నుంచే వచ్చిందని తెలిపారు. అయితే చైనా అధికారులే స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపారా లేక మరేదైనా మార్గంలో డబ్ల్యూహెచ్ఓకు à°ˆ విషయం తెలిసిందా అనే విషయంపై మాత్రం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. కానీ తాజా ప్రకటనతో అప్పటి విషయాలపై కొన్ని అనుమానులు నివృత్తి అయ్యాయి. 

 

డిసెంబర్ 31à°¨ చైనాలో డబ్ల్యూహెచ్ఓ ప్రాంతీయ కార్యాలయం కరోనాను పోలిన కేసు వివరాలను వుహాన్ హెల్త్ కమిషన్ వెబ్‌సైట్‌లో ఉన్న మీడియా ప్రకటన ద్వారా గుర్తించనట్టు తాజా సమాచారం సూచిస్తోంది. à°† సమయంలోనే అమెరికాలోని అంటువ్యాధులపై సమాచారాన్ని సేకరించే ప్రోమెడ్ అనే సంస్థ వుహాన్‌లోని నిమోనియా కేసులను గుర్తించినట్టు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థకు దృష్టికి వచ్చింది.

 

దీంతో అప్రమత్తమైన సంస్థ.. జనవరి 1, 2 వ తేదీలలో రెండు సార్లు ఈ విషయమై చైనాను ప్రశ్నించింది. ఈ క్రమంలో చైనా జనవరి 3న విషయాన్ని తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు అధికారికంగా వెల్లడించింది.