విదేశీ విద్యార్థులకు అమెరికా షాక్ ఇచ్చింది

Published: Tuesday July 07, 2020

అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా షాక్ ఇచ్చింది. కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోనూ కొన్ని విద్యా సంస్థల్లో ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. దీంతో ఆన్ లైన్ క్లాసుల్లో పాల్గొంటున్న విద్యార్థులు తమ దేశంలో ఉండాల్సిన పనిలేదని అమెరికా ప్రకటించింది. ఎఫ్ 1, ఎం1 విద్యార్థులకు మాత్రం వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆన్ లైన్ చదువుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు దేశం విడిచి వెళ్లాలని తేల్చి చెప్పింది. ఒక వేళ అలాంటి విద్యార్థులు దేశంలోనే ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది.