అస్ట్రేలియాకు చైనా వార్నింగ్!

Published: Thursday July 09, 2020

 à°¹à°¾à°‚కాంగ్ పౌరులకు తమ దేశంలో శాశ్వత నివాసం కల్పిస్తామంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించడంపై చైనా మండిపడింది. ఇది అంతర్జాతీయ దౌత్యసంబంధాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. దీనికి బదులు చెప్పే హక్కు తమకు ఉందని, వీటి పర్యవసానాలు ఆస్ట్రేలియా భరించకతప్పదని వార్నింగ్ ఇచ్చింది. à°ˆ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి à°“ ప్రకటన విడుదల చేశారు. కాగా.. హాంకాంగ్ నిరసనకారుల ప్రజాస్వామిక హక్కులు కాలరాసేలా చైనా ప్రభుత్వం జాతీయ భద్రత చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా ఆస్ట్రేలియా కూడా హాంకాంగ్ పట్ల చైనా ప్రదర్శిస్తున్న అప్రజాస్వామిక, ప్రతికార ధోరణిపై మండిపడింది. à°ˆ నేపథ్యంలోనే నేరస్థులను ఇచ్చిపుచ్చుకోవడంపై హాంకాంగ్‌తో ఆస్ట్రేలియాకు ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసింది. అంతే కాకుండా...హాంకాంగ్ పౌరులకు అవసరమైతే తమ దేశంలో శాశ్వత నివాసం కల్పిస్తామని ప్రకటించింది. à°ˆ వైఖరి చైనాకు కోపం తెప్పించడంతో రాబోయే పర్యవసానాలను ఆస్ట్రేలియా భరించకతప్పదంటూ కమ్యునిస్టు దేశం మండిపడింది.