దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా భస్సు ప్రమాదం .. నిద్రలోకి జారుకున్న డ్రైవర్

Published: Monday May 21, 2018

బెంగళూరు: శ్రీ చౌడేశ్వరిదేవి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా పట్టణం సమీపంలో ప్రైవేటు బస్సు లారీ ఢీకొనడంతో 7 మంది దుర్మరణం చెంది 20 మందికి తీవ్రగాయాలైనాయి. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు.

శిరా పట్టణంలోని 60 మంది హనుమాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సులో సింగదూరులోని శ్రీ చౌడేశ్వరిదేవి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. శ్రీ చౌడేశ్వరి దేవి దర్శనం చేసుకుని శిరాకు బయలుదేరారు. సోమవారం వేకువ జామున శిరా పట్టణం సమీపంలోని జాతీయ రహదారిలోని జైహింద్ హోటల్ సమీపంలో వేగంగా వెలుతున్న బస్సు అదుపుతప్పి లారీని ఢీకొనింది.

ఈ ప్రమాదంలో అనూష (7), సవితా (21) రత్నమ్మ (350, శంకర్ (35), అశ్వథ్ నారాయణ (50) ,సుమలత (21), గిరిజమ్మ (50) అనే ఏడు మంది దుర్మరణం చెందారు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా తీవ్రగాయాలు కావడంతో వారిని తుమకూరు జిల్లా ఆసుపత్రికి, శిరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయపడినవారిలో చౌడమ్మ. స్నేహ, జయమ్మ, భూతప్ప, భారతి, యశోధ, అన్నపూర్ణేశ్వరి, జ్యోతి, మోహన్ కుమార్ తదితరుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. డ్రైవర్ నిద్రలోకి జారుకుని నిర్లక్షంగా బస్సు నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.