దేశం దృష్టిని ఆకర్షించిన మాన్సి, మాన్య!

Published: Tuesday July 14, 2020

ఇటీవల విడుదలై సీబీఎస్ఈ ఫలితాల తర్వాత నోయిడాకు చెందిన కవలలు మాన్సి, మాన్యల పేరు మార్మోగిపోతోంది. 9 నిమిషాల తేడాతో పుట్టిన వీరి మధ్య ఎన్నో సారూప్యతలు ఉండడమే ఇందుకు కారణం. 3 మార్చి 2003న వీరిద్దరూ 9 నిమిషాల తేడాతో జన్మించారు. వీరిద్దరినీ వేరు చేసే ఏకైక విషయం ఇప్పటి వరకు ఇదొక్కటే. దానిని పక్కనపెడితే ఇద్దరి ముఖాలు, గొంతు ఒకేలా ఉంటాయి.

 

బ్యాడ్మింటన్‌లో ఇద్దరూ చురుగ్గా ఉంటారు. చివరికి ఆహారపు అలవాట్లు కూడా ఒకలానే ఉంటాయి. తక్కువ కొవ్వులున్న ఆహారాన్ని మాత్రమే ఇద్దరూ ఇష్టపడతారు. అయితే, ఇప్పుడు వీరద్దరికీ సంబంధించిన మరో విషయం తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మరింతగా ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల విడుదలైన సీబీఎస్‌à°ˆ పరీక్ష ఫలితాల్లో ఇద్దరూ ఒకే రకమైన స్కోరు సాధించి అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. సైన్స్ చదువుతున్న ఇద్దరూ 95.8 శాతం స్కోరు చేయడం విశేషం. 

 

ఐదు సబ్జెక్టులలోనూ ఇద్దరికీ ఒకే à°°à°•à°‚à°—à°¾ మార్కులు రావడం చాలా సంతోషంగా ఉందని మాన్సి చెప్పుకొచ్చింది. బోర్డు ఎగ్జామ్స్‌లో మాన్య తనకంటే ఎక్కువ మార్కులు సాధిస్తుందని భావించానని, కానీ ఇద్దరికీ ఒకే à°°à°•à°‚à°—à°¾ మార్కులు వచ్చాయని తెలిపింది. మాన్యకు ఫిజిక్స్‌పై బాగా పట్టుందని, కెమిస్ట్రీలో ఆమె కంటే తాను బెటరని మాన్సి వివరించింది. గ్రేటర్ నోయిడాలోని ఆస్టర్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంటున్న వీరిద్దరూ ప్రతి సబ్జెక్టులోనూ పోటీపడతారు. 

 

వారిలో ఎవరు ఎవరో గుర్తుపట్టేందుకు ఇప్పటికీ కష్టపడుతుంటానని స్కూలు వైస్ ప్రిన్సిపాల్ జైవీర్ దాగర్ అన్నారు. వారి మార్కులు పరిశీలించిన తర్వాత నమ్మలేకపోయామని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కచెల్లెళ్లు ఇద్దరూ ఇంగ్లిష్‌, కంప్యూటర్ సైన్స్‌లో 98 మార్కుల చొప్పున, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 95 చొప్పున మార్కులు సాధించారని వివరించారు. విషయం తెలిసిన కవలల తండ్రి సుచేతన్ రాజ్ సింగ్ వారిని చూస్తుంటే తనకు గర్వంగా ఉందన్నారు. ఇప్పుడు వారిద్దరూ ఇంజినీరింగ్ ఎగ్జామ్స్‌కు సిద్ధమవుతున్నట్టు తల్లి విజయ సింగ్ తెలిపారు. ఇంజినీరింగ్‌లో వారు ర్యాంకు కొల్లగొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.