తిరుమలలో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి : రమణదీక్షితులు

Published: Monday May 21, 2018

 

తిరుమలలో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించినందుకు తనను తప్పించారని.. అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని తితిదే మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు డిమాండ్‌ చేశారని ఈనాడు కథనం పేర్కొంది.

''మైసూరు మహారాజులు ఇచ్చిన ఆభరణంలోనిగులాబీరంగు వజ్రం కొన్నేళ్లుగా కనిపించడం లేదు. ఈ అంశంపై ఎన్నిసార్లు ప్రశ్నించినా సమాధానం చెప్పడం లేదు. ఇటీవల జెనీవాలో వేలానికి వచ్చిన గులాబీరంగు వజ్రం స్వామి వారి వజ్రాన్ని పోలి ఉంది. ఆభరణాల లెక్క తేల్చేందుకు గతంలో అశాస్త్రీయంగా విచారణ జరిగినందున నిజాలు బయటకు రాలేదు. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన, పురావస్తు కట్టడం గోడలు తొలగించడం ఎంతవరకు శ్రేయస్కరం. 1150లో ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించిన పాకశాల(పోటు)ను 25రోజుల పాటు మూసివేయడం దారుణం. అక్కడ తవ్వకాల వెనుక ఆంతర్యం ఏమిటి...''అని రమణ దీక్షితులు ప్రశ్నించారు.