ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

Published: Thursday July 16, 2020

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. పెద్ద సంఖ్యలో టెస్ట్‌లు చేస్తుండటంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి. గురవారం నాడు ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 2,584 à°®à°‚దికి కరోనా సోకినట్లు హెల్త్ బులెటిన్‌లో ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 09 à°®à°‚దికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఇవాళ మొత్తం కేసుల సంఖ్య 2593కు చేరుకుంది.

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,304 à°¶à°¾à°‚పిల్స్‌ను పరీక్షించగా 2,584 à°•à±‡à°¸à±à°²à± నమోదయ్యాయి. మరోవైపు ఒక్కరోజే 943 à°®à°‚ది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. à°—à°¤ 24 గంటల్లో 40 à°®à°‚ది కరోనా మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో-08, ప్రకాశం-08, చిత్తూరు-05, à°•à°¡à°ª-04, అనంతపురం-03, గుంటూరు-03, నెల్లూరు-03, విశాఖపట్నం-03, శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇప్పటి వరకూ మొత్తం 492 మంది రాష్ట్రంలో మృతి చెందారు.

 

ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 12,40,267 à°¶à°¾à°‚పిల్స్‌ను పరీక్షించామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 15,285 మంది ఆస్పత్రుల్లో, 2,874 మంది కోవిడ్ కేర్ సెంటర్స్‌లో వెరసి మొత్తం 18,159 à°®à°‚ది చికిత్స పొందుతున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 590 à°•à±‡à°¸à±à°²à±, తూర్పు గోదావరిలో 500 à°•à±‡à°¸à±à°²à±, చిత్తూరు జిల్లాలో 205 à°•à±‡à°¸à±à°²à± నమోదయ్యాయి. à°—à°¤ కొన్ని రోజులుగా కర్నూలు జిల్లాలో కరోనా ఉధృతి తగ్గిందని అందరూ భావించారు కానీ ఒక్కసారిగా 590 à°•à±‡à°¸à±à°²à± నమోదవ్వడంతో జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.