అక్రమాలకు తెరతీసిన అన్నదమ్ములు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఎక్కువ బుకింగ్‌లు

Published: Thursday July 16, 2020

శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు.. ఇసుక అమ్మకాల్లో అక్రమాలకు తెరదించేందుకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటే అక్రమార్కులు వినూత్న మార్గాలను ఎంచుకొని దందా కొనసాగిస్తున్నారు. ఇసుక విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు సర్కారు ప్రత్యేక  పోర్టల్‌ తయారు చేసి.. రోజులో 15 నిమిషాల పాటే ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అనుమతిస్తోంది. దీంతో భవన నిర్మాణం చేపట్టే వారందరికీ అవసరానికి సరిపడా ఇసుక అందేలా చర్యలు చేపట్టారు. ఫలితంగా ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడింది. యాక్సెస్‌ ఉన్న 15 నిమిషాల్లో ఎన్ని ఆర్డర్‌లు బుక్‌ అయితే అంతమందికే ఇసుక అందే అవకాశం ఉంది. అయితే ఎలాగైనా అధిక సంఖ్యలో ఆర్డర్‌లు బుక్‌చేసి పెద్దమొత్తంలో సంపాదించాలని కామారెడ్డికి చెందిన సిసోడియా ఆదేశ్‌, సిపోడియా హరినాథ్‌ అనే సోదరులు పథకం వేశారు. అందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. కొత్తపేటలోని స్నేహితుడి ఇంట్లో ఉంటూ రోజువారీ బుకింగ్‌లలో అత్యధిక బుకింగ్‌లు సొంతం చేసుకొని, కమిషన్ల రూపంలో లక్షల్లో గడించారు. వీరి ఆటను రాచకొండ ఎస్‌వోటీ సైబర్‌ క్రైం పోలీసులు కట్టించారు.

సోదరులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. సిసోడియా సోదరులకు 5 ఇసుక లారీలు ఉన్నాయి. ఇటీవల అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేసేందుకు సాండ్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎస్‌ఎ్‌సఎంఎంఎస్‌) పోర్టల్‌ను సర్కారు ఏర్పాటు చేసింది. ఇసుక అవసమైన వారి కోసం మధ్యాహ్నం 12:00à°² నుంచి 12:15నిమిషాల వరకు పోర్టల్‌లను యాక్సె్‌సలో ఉంచుతారు. à°ˆ 15 నిమిషాల్లో ఎంతమంది ఇసుక ఆర్టర్‌లు బుక్‌ చేసుకుంటే అంతమందికి చెల్లింపు రసీదు వస్తుంది. దాంతో వారు అందుకు అవసరమైన డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు.

 

 à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• పోర్టల్‌తో ఇసుక దందాలో సంపాదన తగ్గడంతో సిసోడియా సొదరులు à°“ పథకం వేశారు. గూగుల్‌, యూట్యూబ్‌లో శోధించి పేటీఎం యాడ్‌లో ఆటోఫిల్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను గుర్తించారు. à°† యాడ్‌ రిప్రజెంటేటివ్‌ను సంప్రదించి ఆటోఫిల్‌ సాఫ్ట్‌వర్‌ను కొనుగోలు చేసి తమ 5 ల్యాబ్‌టా్‌పలలో ఇన్‌స్టాల్‌ చేశారు. ఒక్కసారి వివరాలు, బ్యాంకు ఖాతా నమోదు చేసి సేవ్‌ చేస్తే క్షణాల్లో బుకింగ్‌లు అయిపోతాయి. ఐడీ నంబర్‌ జనరేట్‌ కాగానే వాళ్ల వద్ద సేవ్‌ చేసి ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులు చెల్లించేవారు. ఇలా 5 ల్యాబ్‌టా్‌పల ద్వారా 15 నిమిషాల్లోనే అత్యధిక ఆర్డర్లు బుకింగ్‌ చేసేవారు. దాంతో అవసరాన్ని బట్టి కస్టమర్ల నుంచి అధిక మొత్తంలో కమిషన్‌ అందేది. కొన్నాళ్లకు  à°ˆ సాఫ్ట్‌వేర్‌  నెమ్మదించడంతో పుణెకు చెందిన అనురాగ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ను సంప్రదించారు. అతడు వేగంగా బుకింగ్‌లు చేసే విధంగా సాఫ్ట్‌వేర్‌ తయారు చేశాడు. అంతేకాకుండా ప్రభుత్వ పోర్టల్‌ వంటి నమూనా కలిగిన పోర్టల్‌ను తయారు చేశాడు.. దాన్ని ఇంటర్నెట్‌లో ఉంచి ఇసుక కావాల్సిన కస్టమర్లను ఆకర్శించడానికి  ప్రకటనలిచ్చాడు.  ఫలితంగా మరిన్ని ఆర్డర్లు వారికి వచ్చేవి. సిపోడియా సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి నుంచి 5 ల్యాబ్‌టా్‌పలు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.