అగ్రి గోల్డ్ మాజీ బోర్డు మెంబర్ సీతారామారావు అరెస్ట్ ...

Published: Tuesday May 22, 2018

అమరావతి: అగ్రి గోల్డ్ ఛైర్మెన్ సోదరుడు, గతంలో బోర్డు మెంబర్‌ à°—à°¾ పనిచేసిన అవ్వా సీతారామారావును సీఐడీ పోలీసులు న్యూఢిల్లీలో మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్ కేసులో సీతారామారావు అరెస్ట్ తో ప్రాధాన్యత సంతరించుకొంది. ముందస్తు బెయిల్ కోర్టు నిరాకరించడంతో సీతారామారావు అదృశ్యమయ్యారు. న్యూఢిల్లీలో ఉన్న సీతారామారావును సిఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అగ్రిగోల్డ్ కు చెందిన ఆస్తులను విక్రయించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ సమయంలో ఎస్సెల్ కంపెనీ ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఎస్సెల్ కంపెనీ ఈ ఆస్తులు కొనుగోలు చేయకుండా సీతారామారామారావు అడ్డుకొన్నారని సీఐడీ పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు కూడ ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు.

అగ్రిగోల్డ్ ఛైర్మెన్ వెంకటరామారావును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సోదరుడు సీతారామారావును అరెస్ట్ చేయకపోవడంపై బాధితులు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సీతారామారావు అరెస్ట్ తో ఈ కేసు మరింత కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదని బాధితులు అభిప్రాయపడుతున్నారు.

2011 వరకు అగ్రిగోల్డ్ బోర్డు మెంబర్ గా సీతారామారావు కొనసాగారు. అయితే అదే సంవత్సరంలో ఆయన బోర్డు మెంబర్ పదవి నుండి తప్పుకొన్నారు. న్యూఢిల్లీలో ఉన్న సీతారామారావును ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడకు తీసుకొస్తున్నారు.

సీతారామారావునును విచారిస్తే ఈ కేసు విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని బాధితులు అభిప్రాయపడుతున్నారు.మరో వైపు అగ్రి గోల్డ్ ఆస్తులను విక్రయించి బాధితులకు పరిహారం చెల్లించే ప్రయత్నాలు సాగుతున్నాయి..అగ్రిగోల్డ్ సంస్థకు ఎక్కడెక్కడ ఏఏ ఆస్తులున్నాయనే విషయమై సీతారామారావుకు తెలిసి ఉంటుందని బాధితులు అనుమానిస్తున్నారు.