ఏపీలో అల్లకల్లోలంగా కరోనా కేసులు..

Published: Sunday July 19, 2020

ఏపీ అల్లకల్లోలంగా మారింది. ఊహలకు అంతుపట్టని విధంగా గుట్టలు గుట్టలుగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఐదు రోజులుగా దడ పుట్టేలా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఏరోజుకారోజు కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఆదివారం కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు నమోదయ్యాయి. à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో 31,148 శాంపిల్స్‌ను పరీక్షించగా ఇందులో 5041 కేసులు పాజిటివ్‌à°—à°¾ తేలాయి. à°† రోజు అత్యధికంగా తూర్పుగోదావరిలో జిల్లాలో 647 కేసులు నమోదయ్యాయి. నిన్న ఇదే జిల్లాలో దాదాపు 1,132 కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్-19 మరణాలు కూడా ఈరోజు అత్యధికంగా నమోదయ్యాయి. కరోనాతో 56 మంది మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా పది మంది, శ్రీకాకుళంలో ఎనిమిది మంది, కర్నూల్ జిల్లాలో ఏడుగురు, కృష్ణలో ఏడుగురు, ప్రకాశంలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

 

రాష్ట్రంలో వైరస్ విలయంపై వైద్యులు, అధికారులు తీవ్ర స్థాయిలో కలవరపడుతున్నారు. పరిస్థితి నానాటికి అదుపు తప్పుతుండడంపై ఆందోళన చెందుతున్నారు. కేసులు ఇంతలా కేక పెడుతున్నా, మరణాల తీవ్రత నిలువునా వణికించేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ‘మీ చావు మీరు చావండి’ అంటూ చేతులెత్తేసింది. అధికార యంత్రాంగం కూడా అప్పుడప్పుడు ప్రకటనలు జారీ చేయడం, ఎక్కువ సందర్భాల్లో చేతులు ముడుచుకుని కూర్చోవడం తప్ప త్వరపడి నియంత్రణ చర్యలకు పూనుకొంటున్న దాఖలు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.