కంపాటిబుల్ స్మార్ట్‌ఫోన్ల కోసం ఈసిమ్..

Published: Monday July 20, 2020

 à°¤à°® పోస్టుపెయిడ్ వినియోగదారుల కోసం వొడాఫోన్ ఈసిమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రొ, ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్ వంటి యాపిల్ ఫోన్లు వాడుతున్న వినియోగదారులందరూ à°ˆ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. త్వరలోనే à°ˆ సదుపాయాన్ని శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్, శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్లకు కూడా విస్తరించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, గుజరాత్‌లోని వొడాఫోన్ పోస్టుపెయిడ్ ఖాతాదారులు తమ స్మార్ట్‌ఫోన్ల కోసం ‘ఈసిమ్’ను పొందవచ్చు. త్వరలోనే మరిన్ని నగరాల్లోని వినియోగదారులకు కూడా à°ˆ సదుపాయం అందుబాటులోకి రానుంది. 

 

ఈసిమ్ అనేది స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే ఇంటిగ్రేటెడ్ సిమ్ చిప్. యూజర్ దీనిని యాక్టివేట్ చేసుకుంటే భౌతిక సిమ్‌తో ఇక పని ఉండదు. సిమ్‌కార్డులను మార్చకుండానే కాల్స్ చేసుకోవచ్చు, మెసేజ్‌లు పంపుకోవచ్చు. మొబైల్‌లో ఇంటర్నెట్‌ను కూడా వినియోగించుకోవచ్చు. ఒకవేళ మీరు వొడాఫోన్ వినియోగదారులై ఉంటే à°ˆ సిమ్‌కార్డును పొందేందుకు 199కు eSIM<space>email ID అని టైప్ చేసి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. à°ˆ మెయిల్ లేకుంటే ఫోన్ నంబరుతో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం email<space>email id అని టైప్ చేసి 199కు మెసేజ్ పంపాలి. 

 

ఒకసారి ఈమెయిల్ ఐడీ రిజిస్టర్ అయ్యాక మొదట పేర్కొన్నట్టు ఎస్సెమ్మెస్ పంపాలి. à°† వెంటనే 199 నుంచి à°’à°• ఎస్సెమ్మెస్ వస్తుంది. అప్పుడు ఈసిమ్ అభ్యర్థనను నిర్ధారించేందుకు  ESIMY అని రిప్లే ఇవ్వాలి. à°† తర్వాత కాల్‌కు సమ్మతి తెలపాలంటూ 199 నుంచి మరో ఎస్సెమ్మెస్ వస్తుంది. సమ్మతి కాల్ వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్ వస్తుంది. దానిని స్కాన్ చేయాల్సి ఉంటుంది. అయితే, à°† సమయంలో వైఫై కానీ, మొబైల్ డేటాతో కానీ ఫోన్‌ కనెక్ట్ అయి ఉండాలి. 

 

à°† తర్వాత మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మొబైల్ డేటాను సెలక్ట్ చేయాలి. అనంతరం ‘యాడ్ డేటా ప్లాన్’పై క్లిక్ చేయాలి. à°† తర్వాత ఈమెయిల్ ద్వారా అందుకున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. కొత్త వినియోగదారులైతే ఈసిమ్ కోసం గుర్తింపు కార్డు, ఫొటోలతో వొడాఫోన్ స్టోర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.