చెత్త వేసే మున్సిపాలిటి బండిలో కరోనా బాధితుడు

Published: Monday July 27, 2020

చెత్త వేసే మున్సిపాలిటి బండిలో కరోనా బాధితుడిని తీసుకు వెళ్లడం బాధాకరమని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. తన సొంతూళ్లో జరిగిన à°ˆ ఘటనపై సిగ్గుతో తలదించుకుంటున్నానని ఆయన అన్నారు. సీఎం జగన్ అట్టహాసంగా ప్రారంభించిన వెయ్యికి పైగా అంబులెన్సులు ప్రారంభించారని.. అవి అవసరానికి ఉపయోగపడలేదన్నారు. తనను క్షమించాలని జనాన్ని కోరారు. ప్రారంభించిన అంబులెన్సులు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. à°ˆ విషయం సీఎం జగన్ దృష్టికి వెళుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లాలని మీడియాకు తెలిపారు. 

 

కేంద్ర ఆరోగ్య సెక్రటరీ రాజేశ్ భూషణ్‌ని తాను కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించానన్నారు. ఏపీలో కోవిడ్ కేసులపై చర్చించినట్టు చెప్పారు. 15à°µ స్థానంలో ఉన్న ఏపీ రాష్టం... కోవిడ్ కేసుల్లో 3à°µ స్ధానంలోకి వెళ్లిందన్నారు. రానున్న రోజుల్లో అగ్రస్థానంలోకి వెళ్తామన్నారు.  రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యమంత్రితో భేటీ అవుతానన్నారు. యాంటీబాడీ టెస్టులతో ఆలస్యం అవుతోందని, కోవిడ్ టెస్టుల ఫలితాలు ఏడు రోజులు తర్వాత వస్తున్నాయని, ఈలోగా సామాజిక వ్యాప్తి జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి అధికారులతో, ఎంపీలతో వెబ్ సెమినార్ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. రోజుకు మూడు జిల్లాల వారితో మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయన్నారు. రాష్ట్రంలో ఇంత కంటే పెద్ద సమస్య ఏదీ లేదని దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో మాస్క్ లేకుండా తిరుగుతున్నారని.. చాలా మంది ఎంపీలు కూడా హాస్పిటల్‌లో కరోనాతో జాయిన్ అయ్యారని చెప్పుకొచ్చారు.  ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ జరుగుతుందని... దానిని అరికట్టాలన్నారు. ఏలూరు హాస్పిటల్లో  ఆక్సిజన్ సెంట్రలైజడ్ చేస్తున్నారని, అలాగే అన్ని జిలాల్లో చేస్తే బాగుంటుందన్నారు. రాష్టంలో ఆయుర్వేదిక్ చదివిన 8 వేల డాక్టర్స్ ఉన్నారని, వారి సేవలను వినియోగించుకోవాలన్నారు.  24 గంటల్లో ఫలితాలు వచ్చేలా కోవిడ్ టెస్టు నిర్వహిస్తే సామాజిక వ్యాప్తి అరికట్ట వచ్చన్నారు. కరోనాతో సహజీవనం వహించాలి అనకుండా దాన్ని అరికట్టాలకన్నారు. మండలస్థాయిలో కమిటీలు వేసి, వాటిల్లో డాక్టర్లను, నిపుణులను తీసుకోవాలన్నారు.