మనం నిఫా వైరస్ కి భయపడాల్సిన అవసరం లేదు

Published: Wednesday May 23, 2018

హైదరాబాద్‌: నిపా వైరస్‌ ఇప్పుడు దేశాన్ని వణికిస్తోంది. à°ˆ వైరస్‌ ఇప్పటికే కేరళ రాష్ట్రంలో 12 మందిని బలిగొనగా, మరికొంత మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నారు. నిపా వైరస్‌ సోకిన వారికి చికిత్స అందిస్తూ అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు కోజికోడ్‌ మెడికల్‌ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిజానికి నిపా వైరస్‌ ఇప్పుడే పుట్టుకొచ్చింది కాదు. 1998-99లోనే మలేషియా, సింగపూర్‌లలో ఇది వ్యాప్తి చెందింది. ఇండియాలోనే గతంలో à°ˆ వైరస్‌ లక్షణాలు కనిపించగా, బంగ్లాదేశ్‌లో ప్రతీ ఏటా దీని ప్రభావం కనిపిస్తుంటుంది.. కొన్ని జాతుల గబ్బిలాలు, సరిగా ఉడకని పంది మాంసం భుజించడం ద్వారా à°ˆ వైరస్‌ సోకినట్లు గుర్తించగా, à°† తరువాత మన దేశంలోని సిలిగురిలో కూడా à°’à°• వ్యక్తి నుంచి మరో వ్యక్తికి à°ˆ వైరస్‌ సోకినట్లు వైద్యులు గతంలోనే ధృవీకరించారు. à°ˆ వైరస్‌ కారణంగా మెదడు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇది ముదరడానికి 7 నుంచి 14 రోజుల సమయం పడుతుంది. à°† తరువాత శరీరంలో చాలా వేగంగా మార్పులు సంభవించడం, తీవ్రమైన జ్వరం, అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడం, లో బీపీ. ఒక్కోసారి కోమాలోకి కూడా వెళ్లడం à°ˆ వ్యాధి లక్షణాలు.మనుషులకు గాలి ద్వారా లేక లాలాజలం ద్వారా, గబ్బిలాలను తాకడం లేదా అవి కొరికిన పండ్లు తినడం ద్వారా à°ˆ వైరస్‌ సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారని పేర్కొంటున్నారు.

ప్రపంచంలో à°ˆ వ్యాధికి ఇప్పటికీ ఎలాంటి వైద్య చికిత్సలు లేవు. కాగా, నిపా వైరస్‌ తీవ్రత దృష్ట్యా ఇది తెలంగాణకు విస్తరించకుండా తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.దేశాన్ని వణికిస్తున్న నిపా వైరస్‌పై తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. దీనిపై వైద్య,ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి నిపా వ్యాధికి ఎలాంటి టీకాలు లేవనీ, నివారణ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు.

ఇప్పటికే దీనిపై పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీతో నిపా వ్యాధి నిర్ధారణ పరీక్షలపై అవగాహనకు వచ్చామన్నారు. అలాగే, ఢిల్లీలోని ఎన్సీడీసీ, మణిపాల్‌లోని ఎంసివిఆర్‌లతోనే మాట్లాడినట్లు చెప్పారు. ప్రధాన వైద్యశాలల్లో ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేస్తున్నామనీ, ఇప్పటికే ఐపీఎం ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ప్రజల్లో అవగాహన, చైతన్యంతో ఇలాంటి వ్యాధులను అదుపు చేయడం, నివారించడం సాధ్యమవుతుందన్నారు.

ప్రస్తుతానికి à°ˆ వైరస్‌ సోకిన వారికి ప్రపంచంలో ఎలాంటి చికిత్స అందుబాటులో లేదన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌, ఫీవర్‌ ఆసుపత్రులతో పాటు వరంగల్‌లోని ఎంజిఎం ఆసుపత్రులలో 5 నుంచి 8 పడకలతో ప్రత్యేక వార్డులు, వ్యాధి నివారణకు రక్త, మూత్ర, సీఎస్‌ఎఫ్‌ నమూనాలను సేకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఐపీఎం డైరెక్టర్‌ à°¡à°¾.శంకర్‌ ఇదే పనిపై ఉన్నారనీ, మిగతా వైద్యశాఖ ఉన్నతాధికారులను సైతం అప్రమత్తం చేశామని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు.