గుడ్ న్యూస్ చెప్పిన రష్యా

Published: Saturday August 08, 2020

కరోనా వ్యాక్సిన్‌పై జరుగుతున్న పరిశోధనల్లో రష్యా గొప్ప పురోగతి సాధించింది. à°ˆ నెల 12à°¨ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని à°† దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓలెగ్ గృందేవ్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ à°† రోజు జరగనుందని తెలిపారు. దీంతో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్న తొలి దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. గామలేయా సెంటర్‌లో దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని, మూడో దశలో ఉందని తెలిపారు. ముందుగా వైద్య వృత్తిలో ఉన్నవాళ్లకు, వృద్ధులకు వ్యాక్సిన్ అందిస్తామని ఆయన అన్నారు. ఉఫా నగరంలో జరిగిన à°“ క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన à°ˆ విషయం తెలిపారు. రష్యా రక్షణ శాఖ, గామలేయా రీసెర్చ్ సంస్థ సంయుక్తంగా à°ˆ ప్రయోగాలు జరుపుతున్నాయి. à°ˆ నెల మధ్యలో ప్రజలకు అందుబాటులోకి రానుండగా, వచ్చే నెల నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేపట్టనున్నట్టు సమాచారం. 

 

అయితే రష్యా ప్రకటనతో శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. పూర్తి స్థాయి ట్రయల్స్‌ తర్వాతే విడుదల చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు రష్యా ప్రకటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని రకాల గైడ్‌లైన్స్‌ను.. ఫాలో అవ్వాల్సిందేనని రష్యాకు సూచించింది.