పదినిమిషాల్లో స్పందించాం.. ప్రాణ నష్టాన్ని తగ్గించాం

Published: Monday August 10, 2020

కోజికోడ్‌ విమాన ప్రమాదంలో.. ప్రాణనష్టాన్ని తగ్గించడానికి సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎ‌స్‌ఎఫ్‌) కీలక భూమిక పోషించింది. ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే సహాయక చర్యలు ప్రారంభించి, సొంత వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించింది. సహాయక చర్యలపై సీఐఎ్‌సఎఫ్‌ ఐజీ సీవీ ఆనంద్‌ పలు విషయాలను  అవి ఆయన మాటల్లోనే..  

 

వందేభారత్‌ ఫ్లైట్‌లో వచ్చేవారిని తనిఖీ చేసేందుకు మా సిబ్బంది సిద్ధమయ్యారు.  సాయంత్రం 7.40à°•à°¿ ఏఎస్సై మంగల్‌ సింగ్‌ డ్యూటీ పోస్టులో, పెట్రోలింగ్‌ టీమ్‌ ఇన్‌చార్జి, ఏఎసై అజిత్‌ సింగ్‌ తన బృందంతో సిద్ధంగా ఉన్నారు. అంతలోనే..   à°ªà±†à°¦à±à°¦ శబ్దం రావడంతో అంతా ఉలిక్కి పడ్డారు. దూరంగా రన్‌వేపై విమానం జారుతూ లోయవైపు దొర్లడాన్ని గమనించారు. విమానం రెండు ముక్కలవ్వడాన్ని వాళ్లు కళ్లారా చూసి, నిశ్చేష్టిలయ్యారు. వెంటనే ఎమర్జెన్సీ విజిల్‌ను మోగించారు. నిమిషాల్లో    చేరుకున్న మావాళ్లు లోపల చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడం ప్రారంభించారు. సీఐఎ్‌సఎఫ్‌ వాహనాల్లో ఆస్పత్రులకు తరలించాం. 

 

9.45 గంటలకల్లా 189 మందిని బయటకు తీశాం. పైలట్లను కాక్‌పీట్‌ భాగాన్ని కత్తిరించి వెలికితీయాల్సి వచ్చింది. అప్పటికే పైలట్‌ దీపక్‌ సాథే చనిపోయారు. ‘మీకేం కాదు. ఆస్పత్రికి తీసుకెళ్తాం’ అంటూ కోపైలట్‌కు ధైర్యం చెప్పాం. కానీ, ఆస్పత్రికి చేరేలోపే తుదిశ్వాస విడిచారు. ఇంధనాన్ని గాల్లోనే చాలా వరకు ఖాళీ చేయడం వల్ల.. విమానానికి మంటలు అంటుకోలేదు. అదే జరిగి ఉంటే.. ప్రాణనష్టం పెరిగి ఉండేది.