భారత్‌లో కరోనా రికవరీ రేటు 70 శాతానికి చేరింది

Published: Tuesday August 11, 2020

 à°­à°¾à°°à°¤à±‌లో కరోనా రికవరీ రేటు 70 శాతానికి చేరింది. అదే సమయంలో మరణాల రేటు 1.99 శాతానికి తగ్గింది. à°ˆ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. పది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీ, పశ్చిమబెంగాల్‌లో కరోనా టెస్టులు సంఖ్య పెంచాలని సూచించారని రాజేశ్ భూషణ్ తెలిపారు.

 

మరోవైపు కరోనా వ్యాక్సిన్ తయారీ, వినియోగం, పంపిణీ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ బుధవారం సమావేశం కానుందని ఆయన వెల్లడించారు. తయారీదారులతో, రాష్ట్రాలతో నిపుణుల కమిటీ చర్చలు జరుపుతుందని తెలిపారు. వ్యాక్సిన్ విడుదల చేసిన రష్యాతో భారత్ ఒప్పందం చేసుకుంటుందా అనే విషయంపై నిపుణుల కమిటీ తేలుస్తుందని రాజేశ్ భూషణ్ తెలిపారు. 

 

మరోవైపు భారత్‌లో ఇప్పటివరకూ రెండున్నర కోట్ల టెస్టులు చేశామని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది.