భారత్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధం

Published: Monday August 17, 2020

 à°­à°¾à°°à°¤à±, చైనా పరస్పరం గౌరవించుకోవాలని చైనా సుద్దులు చెప్తోంది. విభేదాలను సరైన రీతిలో నిభాయించుకోవాలంటోంది. భారత్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమేనని చెప్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా చేసిన ప్రసంగానికి స్పందనగా చైనా à°ˆ వ్యాఖ్యలు చేసింది. 

 

ఆగస్టు 15à°¨ ఎర్ర కోట బురుజుల నుంచి స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ, భారత దేశపు సాయుధ దళాలను బలోపేతం చేయడం గురించి మాట్లాడారు. భారత దేశ భూభాగాల à°…à°–à°‚à°¡à°¤ అత్యున్నతమైనదని స్పష్టం చేశారు. 

 

నియంత్రణ రేఖ నుంచి వాస్తవాధీన రేఖ వరకు భారత దేశ సార్వభౌమాధికారంపై ఎవరైనా కన్నెత్తి చూస్తే, వారికి అర్థమయ్యే భాషలో భారత సాయుధ దళాలు సమాధానం చెప్తున్నాయని మోదీ అన్నారు. 

 

మోదీ ప్రసంగంపై స్పందించాలని చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి ఝావో లిజియాన్‌ను కోరినపుడు ఝావో మాట్లాడుతూ, తాము ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని గమనించామన్నారు. తమవి సమీప పొరుగు దేశాలన్నారు. 100 కోట్లకు పైగా ప్రజలుగల అభివృద్ధి చెందుతున్న దేశాలని తెలిపారు. 

 

ద్వైపాక్షిక సంబంధాలు శక్తిమంతంగా అభివృద్ధి చెందితే ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలకు మాత్రమే కాకుండా, à°ˆ ప్రాంతం, యావత్తు ప్రపంచం శాంతి, సుస్థిరత, సౌభాగ్యాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ఒకరినొకరు గౌరవించుకోవడం, సహకరించుకోవడమే ఇరు దేశాలకు సరైన మార్గమని, దీనివల్ల దీర్ఘ కాలిక ప్రయోజనాలు నెరవేరుతాయని చెప్పారు. 

 

భారత దేశంతో కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాజకీయ పరస్పర నమ్మకాన్ని వృద్ధి చేసుకోవడానికి, విభేదాలను సరైన రీతిలో నిభాయించుకోవడానికి, ఆచరణాత్మక సహకారాన్ని పెంచుకోవడానికి, ద్వైపాక్షిక సంబంధాల దీర్ఘకాలిక అభివృద్ధిని కాపాడుకోవడానికి చైనా సిద్ధంగా ఉందన్నారు.