ఇస్రో ప్రైవేటుపరం కాదు

Published: Thursday August 20, 2020

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ప్రైవేటుపరం చేయనున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు à°† సంస్థ చైర్మన్, సెక్రటరీ కె.శివన్ గురువారంనాడు తోసిపుచ్చారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో అనేక సంస్కరణలు తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని,  ఇస్రో ప్రైవేటుపరం కాదని ఆయన స్పష్టం చేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో సంస్కరణల ప్రకటన ప్రైవేటీకరణకు ఉద్దేశించినది ఎంతమాత్రం కాదని ఆయన చెప్పారు.

 

'ప్రభుత్వం స్పేస్ సెక్టార్‌లో సంస్కరణలు తెస్తున్నట్టు ప్రకటించగానే కొందరు ఇస్రోను ప్రైవేటుపరం చేస్తారనే అపోహలను తెరపైకి తెచ్చారు. అలాంటిదేమీ లేదు. ఇస్రో ప్రైవేటుపరం కాదని పదేపదే నేను చెబుతూనే ఉన్నాను' అని శివన్ పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులు కూడా అంతరిక్ష కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా మెకానిజం ఉంటుందని, లేదంటే ఇస్రోనే à°† పని నిర్వహిస్తుందని వివరించారు. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో నిజమైన గేమ్-చేంజర్‌‌à°—à°¾ సంస్కరణలు ఉండబోతున్నాయని చెప్పారు. ప్రతిపాదిత స్పేస్ యాక్టివిటీ బిల్లు ముసాయిదా దాదాపు తుది దశలో ఉందని, త్వరలోనే ఆమోదం కోసం కేబినెట్ ముందుకు వస్తుందని చెప్పారు