రష్యా వ్యాక్సిన్ల్‌పై ప్రపంచ దేశాల అనుమానాలు

Published: Saturday August 22, 2020

సెప్టెంబర్ చివరి కల్లా కరోనాకు మరో వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తామని రష్యాకు చెందిన వెక్టర్ స్టేట్ రీసెర్చ్ ఆఫ్ వైరాలజీ అండ్ బయో టెక్నాలజీ సంస్థ తెలిపింది. à°ˆ వ్యాక్సిన్‌కు సంబంధించిన ట్రయల్స్ అన్నీమరో నెల రోజుల్లో పూర్తవుతాయని రష్యా పరిశోధకులు అంటున్నారు. à°ˆ రెండో వ్యాక్సిన్‌కు 'ఎపివ్యాక్ కరోనా' అని నామకరణం చేశారు.

 

మనుషులపై ఇప్పటివరకు చేసిన ట్రయల్స్‌లో à°ˆ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కనబడలేదని, మొత్తం 57 మంది వలంటీర్స్‌కు 'ఎపివ్యాక్ కరోనా' మొదటి డోజ్ ఇచ్చినట్లు వెక్టర్ రీసెర్చ్ సంస్ధ తెలిపంది. వ్యాక్సిన్ ఇచ్చిన 14 నుంచి 21 రోజుల్లో కరోనా వైరస్‌తో పోరాడే యాంటీబాడీలు వలంటీర్స్ శరీరంలో తయారవుతున్నాయని పరిశోధకులు అంటున్నారు. ఇదిలా ఉండగా రష్యా ఆమోదించిన మొదటి వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వి'ని సురక్షితమైనదిగా నిరూపించడానికి à°ˆ వారంలోనే 40 వేల మందిపై ప్రయోగాలు చేయనున్నారు. ఇందుకోసం 'స్పుత్నిక్ వి' మొదటి బ్యాచ్ ఇప్పటికే సిద్ధంగా ఉందని రష్యా మీడియా చెబుతోంది.

రష్యా ఇంత త్వరగా వ్యాక్సిన్లు తీసుకురావడంపై ప్రపంచ దేశాల నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించకుండా à°“ వ్యాక్సిన్‌ని రష్యా ఆమోదించడం సమంజసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న తరుణంలో రష్యా ఇలా వ్యాక్సిన్లను ప్రకటించడం తొందరపాటు నిర్ణయమని వారంటున్నారు. కానీ రష్యా పరిశోధకులు మాత్రం తాము అన్ని నియమాలను పాటించామని, ఎటువంటి ఆందోళనలు అవసరం లేదని చెబుతున్నారు.

 

కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం భారతదేశం సహకారం అవసరమని రష్యా భావిస్తోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం భారత్‌తో భాగస్వామిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇందుకోసం రష్యన్ డైరెక్ట్ ఫండ్ ద్వారా భారత్‌‌లో పెట్టుబడులు పెడతామని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ సీఈఓ కెరిల్ దిమిత్రి అన్నారు.