కన్నపేగు కాదనుకుంటే.. ‘చంద్రన్నభీమా ’ ఆదుకుంది

Published: Thursday May 24, 2018


అవును... మీరు చదివింది నిజమే. మానవత్వం వద్దన్నా... చంద్రన్న బీమా ఉపయోగపడింది. à°ˆ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అల్లు సత్యనారాయణ (గోకవరం సత్తిబాబు). పాయకరావుపేట పంచాయతీకి చెందిన ఈయన లారీ డ్రైవర్‌. శరీరంలో ఓపిక ఉన్నంతకాలం రెక్కలు ముక్కలు చేసుకుని భార్యా పిల్లలను పోషించాడు. ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచాన పడ్డాడు. తన భార్య ఉన్నంతవరకు ఆయన బాగోగులు చూసుకునేది. ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి ఇద్దరు కుమారులు పట్టించుకోవడం మానేశారు.
 
దీంతో కొద్ది రోజులుగా స్థానిక ఆర్టీసీ బస్టాండులో కాలం వెల్లదీస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున చనిపోయాడు. ఈ విషయాన్ని స్థానికులు, పోలీసులు కుటుంబ సభ్యులకు చెబితే మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు నిరాకరించారు. ఇంతలో ఎవరో మృతుడికి చంద్రన్న బీమా వస్తుందని చెప్పడంతో వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. ఈ సంఘటన చూసిన పలువురు తీవ్ర ఆవేదన చెందారు. మానవత్వం నశించిన చోట చంద్రన్న బీమా ఆదుకుందని విచారం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయమై చంద్రన్న బీమా సిబ్బంది కుమా రిని వివరణ కోరగా బుధవారం ఆర్టీసీ బస్టాండులో అల్లు సత్యనారాయణ అనే వ్యక్తి చనిపోయినట్టు సమాచారం వచ్చిందన్నారు. పరిశీలించి వివరాలు నమోదు చేస్తామని ఆమె తెలిపారు.