పెరిగిన పెట్రో ధరలు...... దిగివచ్చిన ప్రభుత్వం

Published: Thursday May 24, 2018

మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనిపై ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే జర్మనీలో ఇటువంటి స్థితే ఏర్పడినప్పుడు అక్కడి ప్రజలు చేపట్టిన ఆందోళన à°† ప్రభుత్వాన్ని దిమ్మతిరిగిపోయేలా చేసింది. దెబ్బకు అక్కడి ప్రభుత్వం దిగివచ్చి, పెట్రో ధరలను సాధారణ స్థితికి తీసుకువచ్చింది. à°ˆ ఉదంతం 2000à°µ సంవత్సరంలో జరిగింది. జర్మనీతోపాటు చాలా యూరప్ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. à°ˆ సందర్భంగా అక్కడి ప్రజలు వినూత్న రీతిలో ప్రభుత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా తమ వాహనాలను రోడ్డుపైకి తీసుకువచ్చి అక్కడే వదిలేసి, తమ పనుల మీద వెళ్లిపోయారు. దూరప్రాంతాల్లో ఉన్న ట్రక్కు డ్రైవర్లు, రైతులు బెర్లిన్ చేరుకుని తమ వాహనాలను సిటీ సెంటర్‌లోని రోడ్లపై విడిచిపెట్టేశారు. à°ˆ విధంగా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలంతా à°ˆ విధమైన ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రభుత్వం దిగివచ్చి, పెట్రో ఉత్పత్తులపై విధించిన పన్నును ఉపసంహరించాల్సి వచ్చింది