టెన్సెంట్‌కు రూ. లక్ష కోట్లకుపైగా నష్టం

Published: Thursday September 03, 2020

భారత్‌లో పబ్‌జీపై వేటు పడటంతో à°† యాప్‌ను రూపొందించిన టెన్సెంట్‌కు 14 బిలియన్ డాలర్ల(దాదాపు లక్ష కోట్ల రూపాయలు) నష్టం వాటిల్లిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టెన్సెంట్‌‌కు చెందిన వీ చాట్‌ యాప్‌ను కూడా కేంద్రం ఇటీవల బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. పబ్‌జీకి సంబంధించినంత వరకూ భారత్ టెన్సెంట్‌కు అతి పెద్ద మార్కెట్ కావడంతో.. à°ˆ పరిణామం కంపెనీకి భారీ కుదుపు అని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

à°ˆ అంచనాకు తగ్గట్టుగానే.. నిషేధం తరువాత టెన్సెంట్ షేరు విలువ ఏకంగా 2 శాతం మేర పతనమైంది. సరిహద్దు వద్ద చైనా చెలరేగుతున్న నేపథ్యంలోనే చైనా టెక్ సంస్థలపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ à°ˆ నిర్ణయం తీసుకుంది. కాగా.. భారత్ విధించిన నిషేధాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది తమ మదుపర్ల హక్కులను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. à°ˆ తప్పులను సరిదిద్దు కోవాలని చెబుతూ తప్పంతా భారత్‌దేనని వాదించే ప్రయత్నం చేసింది.