ఐదుగురు భారతీయలను అపహరించిన పీఎల్ఏ.

Published: Saturday September 05, 2020

అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా బలగాలు బరితెగించాయి. ఐదుగురు భారతీయులను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) అపహరించుకు వెళ్లిందన్న ఆరోపణలపై à°† రాష్ట్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చైనా-ఇండియా సరిహద్దుల్లో ఉన్న ఎగువ సుబాన్‌సిరి జిల్లాలోని అడవుల్లో వేటకు వెళ్లిన ఐదుగురు భారతీయులను చైనా బలగాలు అపహరించుకుని వెళ్లాయి. à°ˆ విషయాన్ని సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించినట్టు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

 

జిల్లాలోని నాచో ఏరియాలో  శుక్రవారంనాడు à°ˆ ఘటన చోటుచేసుకున్నట్టు అహరణకు గురైన వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వేటకు వెళ్లిన గ్రూపులోని ఇద్దరు ఎలాగో తప్పించుకుని పోలీసులకు à°† విషయం ఫిర్యాదు చేశారు.

 

కాగా, à°ˆ ఘటనపై వాస్తవాలను నిర్ధారణ చేసుకుని, తక్షణం నివేదిక ఇవ్వాల్సిందిగా నాచో పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఆఫీసర్‌ను ఆదేశించినట్టు పోలీస్ సూపరింటెండెంట్ తరు గుస్సార్ తెలిపారు. ఆదివారం ఉదయానికల్లా నివేదిక రావచ్చని ఆయన చెప్పారు. కాగా, అపహరణకు గురైనట్టు చెబుతున్న వ్యక్తులను టాచ్ సింగం, ప్రసత్ రింగ్లింగ్, దాంగ్టు ఇబియ, తను బకెర్, నగగ్రు à°¡à°¿à°°à°¿à°—à°¾ గుర్తించారు. వీరంతా టగిన్ కమ్యూనిటీకి చెందిన వారు.

 

జిల్లా ప్రధాన కార్యాలయానికి 120 కిలోమీటర్ల దూరంలో నాచో ఉంది. అపహరణకు గురైన వ్యక్తులను అధికారులు వెనక్కి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని  వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఐదుగురు వ్యక్తులను అపహరించుకు వెళ్లినట్టు పసిఘాట్ వెస్ట్ ఎమ్మెల్యే నినోంగ్ ఎరింగ్ శనివారం ఉదయం ట్వీట్ చేయడం సంచలనమైంది.