భారత్ పై నెపం నెట్టేసిన చైనా

Published: Saturday September 05, 2020

 

‘‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటా’’ అన్నట్లు తప్పు చేసిన చైనా à°† నెపాన్ని భారత్ పైకి నెట్టేస్తోంది. గాల్వాన్ లో జరిగిన ఘర్షణాత్మక వైఖరికి పూర్తి బాధ్యత భారతే వహించాలని చైనా ప్రభుత్వం అంటోంది. చైనాకు చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోడానికి సిద్ధంగా లేమని చైనా ప్రకటించింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంట ఉద్రికత్త పెరగడానికి భారత్ వైఖరే కారణమని ఆరోపించింది.

 

అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాస్కోలో జరిగిన రక్షణ మంత్రుల సమావేశంలో చైనాపై తీవ్రంగా మండిపడ్డారు. భారత్ జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సరిహద్దు ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. భారత్ సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించుకుంటామని ప్రకటించారు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని రాజ్‌నాథ్ సింగ్ చురకలంటించారు.