రోజూ పది వేలకుపైగా కరోనా కేసులు

Published: Monday September 07, 2020

దక్షిణ భారత దేశంలో ఏపీ కరోనాకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారింది. రాష్ట్రంలో రోజూ పది వేలకుపైగా కేసులు బయటపడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 72,573 శాంపిల్స్‌ను పరీక్షించగా 10,794 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,98,125à°•à°¿ చేరుకుని.. 5 లక్షల మార్కుకు చేరువైంది. కాగా.. కరోనా మరో 70 ప్రాణాలను బలితీసుకుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,417à°•à°¿ పెరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ జూలై 15 నుంచి భయంకరంగా విజృంభిస్తోంది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 6 వరకూ 1,26,486 కేసులు వెలుగు చూశాయి. వాటిలో à°—à°¤ 10 రోజుల్లోనే 1,05,035 కేసులు బయటపడ్డాయి. పాజిటివ్‌లతో పాటు మరణాలు కూడా అంతే స్థాయిలో నమోదయ్యాయి. à°—à°¤ పది రోజుల్లో ఏపీలో 703 మంది కరోనాతో మరణించారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ పది రోజుల్లో లక్ష కేసులు, 700 మందిపైన మృతి చెందిన దాఖలాలు లేవు.

 

సెప్టెంబరు, అక్టోబరులోనూ కరోనా తీవ్రత మరింత అధికంగా ఉంటుందని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. ఆదివారం నమోదైన వాటిలో.. నెల్లూరులో అత్యధికంగా 1,299 కేసులు వెలుగుచూశాయి. తూర్పుగోదావరిలో 1,244, పశ్చిమగోదావరిలో 1,101, ప్రకాశంలో 1,042, చిత్తూరులో 927, కడపలో 904, శ్రీకాకుళంలో 818 కేసులు నమోదయ్యాయి. కాగా.. చిత్తూరులో 9, అనంతపురంలో 8, గుంటూరులో 8, ప్రకాశంలో 8, కడపలో 7, తూర్పుగోదావరిలో 5, విశాఖపట్నంలో 5, పశ్చిమగోదావరిలో 5, కృష్ణాలో 4, కర్నూలులో 4, నెల్లూరులో 4, శ్రీకాకుళంలో 2, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు.