రథం దగ్ధంపై ఐదు ప్రత్యేక బృందాల దర్యాప్తు

Published: Tuesday September 08, 2020

అంతర్వేదిలో రథం అగ్నికి ఆహుతైన ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆలయ ఇన్‌చార్జి ఈవో ఎన్‌ఎ్‌à°¸.చక్రధరరావుపై బదిలీ వేటు వేసింది. ఆలయ సిబ్బందిపైనా చర్యలకు à°°à°‚à°—à°‚ సిద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం ఆదివారం దగ్ధమైన విషయం తెలిసిందే.

 

ఘటనపై ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పోలీసు యంత్రాంగం à°† ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుంది. à°’à°• బృందం ఆలయ సిబ్బంది, అర్చకులను విచారిస్తుండగా, మరో బృందం క్లూస్‌ సేకరించే పనిలో ఉంది. ఇంకో బృందం గ్రామస్థులను విచారిస్తుండగా, సీసీ ఫుటేజ్‌లు పరిశీలించే పనిలో మరో బృందం ఉంది. ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు, జిల్లా ఎస్పీ నయీంఅస్మీ, ఫోరెన్సిక్‌ ఐజీ రాజేంద్రససేన్‌à°² పర్యవేక్షణలో వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.

 

ఆలయ ఇన్‌చార్జి ఈవోపై వేటు వేసే లక్ష్యంతో ఎవరైనా ఇలా కుట్ర పన్నారా? అన్న కోణంలోను దర్యాప్తు కొనసాగుతోంది. ఇన్‌చార్జి ఈవో ఎన్‌  ఎ్‌à°¸.చక్రధరరావును ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. ఆలయ సిబ్బందిపైనా చర్యలకు à°°à°‚à°—à°‚ సిద్ధం చేసింది. దేవదాయశాఖ కమిషనర్‌ భ్రమరాంబ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సిబ్బంది వ్యవహారశైలిపై విచారణ చేపట్టారు.