సీట్ల పంపకంపై చర్చలు ప్రారంభం

Published: Sunday September 13, 2020

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. త్వరలో బిహార్‌లో జరిగే శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే సారథి నితీశ్ అని చెప్పకనే చెప్పారు. నవ భారతం, నవ్య బిహార్ కోసం నితీశ్ విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

అభివృద్ధిలో అనేక సంవత్సరాల పాటు బిహార్ వెనుకబడిందని, రాజకీయాలు, నిధుల కొరత దీనికి కారణాలని మోదీ చెప్పారు. రోడ్ల అనుసంధానం, ఇంటర్నెట్ కనెక్టివిటీ గురించి చర్చ జరగని రోజులు ఉండేవన్నారు. అన్ని వైపులా భూమి ఉన్న à°ˆ రాష్ట్రం అనేక సవాళ్ళను ఎదుర్కొందని చెప్పారు. నవ భారతం, నవ్య బిహార్ కోసం మనం ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించడంలో నితీశ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఒకప్పుడు నితీశ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించేవారు. 2013లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి వైదొలగారు. 

2015లో జరిగిన బిహార్ శాసన సభ ఎన్నికల్లో మోదీ, నితీశ్ మధ్య తీవ్రమైన రాజకీయ పోరు జరిగింది. అయితే 2017లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో తెగదెంపులు చేసుకుని తిరిగి బీజేపీతో చేతులు కలిపారు. 

ఇదిలావుండగా అక్టోబరు-నవంబరు నెలల్లో జరిగే బిహార్ శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే పక్షాలకు సీట్ల కేటాయింపుపై మంతనాలు ప్రారంభమయ్యాయి. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ శనివారం à°“ గంటపాటు చర్చలు జరిపారు. అయితే ఎల్‌జేపీ à°ˆ చర్చల్లో పాలుపంచుకోలేదు. జేడీయూ, ఎల్‌జేపీ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయనే వాదన వినిపిస్తోంది.